Share News

రైతు రుణమాఫీ బూటకం

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:52 PM

రైతులకు రుణమాఫీ చేశామని కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు ప్రచారం చేస్తోందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రైతు రుణమాఫీ బూటకం

పెద్దపల్లిటౌన్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): రైతులకు రుణమాఫీ చేశామని కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు ప్రచారం చేస్తోందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే విజయరమణారావు సొంత ఊరిలో సర్వే చేయడానికి తాము సిద్ధమని, ఎంతమంది రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ అయ్యిందో తేలుతుందని స్పష్టం చేశారు. రూ.2 లక్షల కంటే అధికంగా రుణాలు పొం దిన రైతుల పరిస్థితి ఏంటని, సరైన విధానం అమలు చేయకపోవడం వల్ల రాష్ట్రంలోని రైతులు ఆగమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ఇన్‌ పుట్‌ సబ్సిడీ ఇచ్చి సత్వరమే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

డీ 83 ద్వారా చివరి ఆయకట్టు భూములకు నీరందించాలని కోరారు. ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లింపు గడువు తేదీని మరో నెలరోజులు పొడిగించాలని గుజ్జుల డిమాండ్‌ చేశారు. జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి మాట్లాడుతూ హనుమాన్‌ మాలధారణ చేసిన విద్యార్థి పట్ల అనుచితంగా వ్యవహరించిన సెయింట్‌ఆన్స్‌ పాఠశాల అనుమతులు రద్దు చేయా లని డిమాండ్‌ చేశారు. నాయకులు ఠాకూర్‌ రాంసింగ్‌, పల్లె సదానందం, వెల్లంపల్లి శ్రీనివాసరావు, పర్ష సమ్మయ్య, కడారి అశోక్‌ రావు, చక్రధర్‌ రెడ్డి, పాల్గొన్నారు

Updated Date - Mar 27 , 2025 | 11:52 PM