Share News

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

ABN , Publish Date - Mar 24 , 2025 | 12:10 AM

రాష్ట్రంలో ప్రజాపాలనతో పాటు రైతు ప్రభుత్వం కొనసాగుతుం దని రైతుల సంక్షేమం అభివృద్దే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. చిన్నకలువల సహకార సంఘం పాలకవర్గం సమావేశం ఆదివారం సింగిల్‌ విండో చైర్మన్‌ మోహన్‌ రావు అధ్యక్షతను జరిగింది.

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

సుల్తానాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజాపాలనతో పాటు రైతు ప్రభుత్వం కొనసాగుతుం దని రైతుల సంక్షేమం అభివృద్దే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. చిన్నకలువల సహకార సంఘం పాలకవర్గం సమావేశం ఆదివారం సింగిల్‌ విండో చైర్మన్‌ మోహన్‌ రావు అధ్యక్షతను జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్‌ రెడ్డి రైతుల సమస్యల పరిష్కారానికి, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరిం చారు. గత ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి అక్ర మాలు చోటు చేసుకున్నాయని, ఈ గ్రామంలోని చెరువు మట్టిని అమ్ముకున్నారని అరోపించారు.

గ్రామంలో ఫంక్షన్‌ హాల్‌ నిర్మించాలని రైతులు కోరగా అందుకు నిధులు మంజూరుకు కృషి చేస్తానన్నారు. గోదాము నిర్మించి రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచేం దుకు దేవునిపల్లిలో ఆరు గుంటల స్థలాన్ని మంజూరు చేయాలని చైర్మన్‌ అడుగగా మంజూరు చేస్తామన్నారు. పాలకవర్గం వ్యయ ఆదాయాలను సీఈఓ రమేష్‌ చదివి వినిపించారు. ఎమ్మెల్యేను ఘనంగా సన్మానిం చారు. మార్కెట్‌ చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌రావు, సుగుణాకర్‌రావు, మురళీదర్‌ రావు, రమేష్‌, సొసైటీ వైస్‌చైర్మన్‌ కందుల రాజు, డైరక్టర్లు గుర్రం సత్తయ్య, అంజయ్య, లింగయ్య, ఈరయ్య, శ్రీకాంత్‌, పద్మ, నిర్మల, మాధవరావు, సం పత్‌, విజయ్‌, సిబ్బంది పర్శరామ్‌, సంపత్‌, వినోద్‌, శివరామక్రిష్ణ, సురేష్‌, సంపత్‌, సతీష్‌ తో పాటు రైతులు నాయకులు కృష్ణారావు,విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 12:10 AM