Share News

బ్యాంకులలో భద్రత చర్యలు చేపట్టాలి

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:54 PM

బ్యాంకులలో భద్రత చర్యలు చేపట్టాలని పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. జిల్లా కేంద్రంలోని సాగర్‌ రోడ్డులో బుధవారం అర్ధరాత్రి పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్‌ కార్యక్రమం చేపట్టారు. పోలీస్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఎల్లమ్మ చెరువు కట్ట ప్రాంతం, మున్సిపాల్‌ కాంప్లెక్స్‌ ఏరియా ప్రాంతాలతో పాటు ఏటీఎం సెంటర్‌లను సందర్శించారు.

బ్యాంకులలో భద్రత చర్యలు చేపట్టాలి

పెద్దపల్లిటౌన్‌,మార్చి 27 (ఆంధ్రజ్యోతి): బ్యాంకులలో భద్రత చర్యలు చేపట్టాలని పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. జిల్లా కేంద్రంలోని సాగర్‌ రోడ్డులో బుధవారం అర్ధరాత్రి పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్‌ కార్యక్రమం చేపట్టారు. పోలీస్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఎల్లమ్మ చెరువు కట్ట ప్రాంతం, మున్సిపాల్‌ కాంప్లెక్స్‌ ఏరియా ప్రాంతాలతో పాటు ఏటీఎం సెంటర్‌లను సందర్శించారు. అర్ధరాత్రి బయట తిరుగుతున్న వారిని ప్రశ్నించారు. పోలీస్‌ పెట్రోలింగ్‌తోపాటు, రాత్రి సమయంలో అనుమానాస్పదంగా తిరిగే వారి గురించి, గంజాయి, మద్యం సేవించి తిరిగే ఆకతాయిల గురించి, ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద నుంచి డ్రోన్‌ ద్వారా పరిశీలించారు.

ఏటీఎం సెంటర్‌లలో అలారం సిస్టమ్‌, సీసీ కెమెరాల పని తీరు, ఇతర భద్రత విషయాలపై సెక్యూరిటీ గార్డ్‌ను తెలుసుకొన్నారు. బ్యాంకులలో అలారం సిస్టం, సీసీ కెమెరాల పనితీరు, సెక్యూరిటీ గార్డ్స్‌ ఇతర భద్రత ఏర్పాట్లు తనిఖీ చేసి అధికారులతో మాట్లాడారు. భద్రత చర్యలు సరిగా లేని బ్యాంకులలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి మద్యం షాపులు, ఇతర వ్యాపార సంస్థలు సమయపాలనపై పోలీస్‌ కమిషనర్‌ పరిశీలించారు. డీసీపీ కరుణాకర్‌, ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్‌,ఎస్సై లక్ష్మన్‌రావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 11:54 PM