Share News

సహకార సంఘం బలోపేతానికి చర్యలు

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:29 AM

పెద్ద్దపల్లి మండలం అప్పన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు చైర్మన్‌ చింతపండు సంపత్‌ తెలిపారు. సొసైటీ కార్యా లయ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చించి సభ్యులు, రైతుల సమక్షంలో తీర్మానించారు.

సహకార సంఘం బలోపేతానికి చర్యలు

పెద్దపల్లి రూరల్‌, మార్చి 28 (ఆంధ్రప్రభ): పెద్ద్దపల్లి మండలం అప్పన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు చైర్మన్‌ చింతపండు సంపత్‌ తెలిపారు. సొసైటీ కార్యా లయ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చించి సభ్యులు, రైతుల సమక్షంలో తీర్మానించారు. బంగారు ఆభరణా లపై రుణాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కేయూఎస్‌ఎం కింద రూ.3 కోట్లతో అప్పన్నపేట సొసైటీ ద్వారా సోలార్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమై నట్లు తెలిపారు. రాఘవాపూర్‌ రెవెన్యూ శివారులో సోలార్‌ ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. రాగినేడు - కనగర్తి శివారులోని సొసైటీ ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంకు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సంఘంలో సభ్యు డు రుణం తీసుకొని బకాయి ఉన్న సమయంలో మర ణిస్తే వారి కుటుంబాలకు రూ.10 వేలు ఇచ్చేందుకు ఆమోదించినట్లు తెలిపారు. ప్రస్తుత వేసవిలో కొనుగోలు కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. రైతులు కొనుగోలు కేం ద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.

బీమా సొమ్ము పంపిణీ

సంఘంలో సభ్యులుగా ఉండి ఇటీవల మృతిచెం దిన బ్రాహ్మణపల్లికి చెం దిన దాసరి శివప్రసాద్‌ భార్య సుమలతకు రూ.లక్ష, పెద్దపల్లికి చెందిన రాపెల్లి లక్ష్మయ్య మృతిచెందగా అతని భార్య భారతికి రూ. లక్ష బీమా చెక్కులను సిం గిల్‌ విండో చైర్మన్‌ సంపత్‌ అందించారు. సంఘం పరి ధిలోని 15 మంది సభ్యులకు దీర్ఘకాలిక రుణాల కింద రూ.82 లక్షలను అందించినట్లు తెలిపారు. ఉత్తమ రైతు అవార్డు పొందిన కాసులపల్లికి చెందిన ఎర్రం మల్లారెడ్డి, ఏఈవో పూర్ణచందర్‌లు సన్మానించారు. సీఈవో తిరుప తి, ఏఎంసీ డైరెక్టర్‌ సోమ చంద్రయ్య, పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 12:29 AM