Share News

హాలియాలో పట్టపగలు దొంగల బీభత్సం

ABN , Publish Date - Mar 03 , 2025 | 11:43 PM

నల్లగొండ జిల్లా హాలియా మునిసిపాలిటీలో సోమవారం దొంగల పట్టపగలే బీభత్సం సృష్టించారు.

 హాలియాలో పట్టపగలు దొంగల బీభత్సం
ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌ టీం

హాలియా, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లా హాలియా మునిసిపాలిటీలో సోమవారం దొంగల పట్టపగలే బీభత్సం సృష్టించారు. సాయిప్రతాప్‌ నగర్‌లో మూడు ఇళ్లలో బంగారం, వెండి ఆభరణాలు, నగదును చోరీ చేశారు. ఎస్‌ఐ సతీ్‌షరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో వీరయ్యనగర్‌లో నివాసముంటున్న రిటైర్డ్‌ వెటర్నరీ ఉద్యోగి తుమ్మురుకోటి రామలింగయ్య ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఇంటి తలుపు పగలకొట్టి సుమారు 47.5 గ్రాముల బంగారు గొలుసు, ఉంగరాలను చోరీ చేశారు. అదే ఇంటిపైన ఉన్న శాగం వెంకటేశ్వర్‌రెడ్డి ఇంట్లో 15తులాల వెండి పట్టాలను, రూ.10వేల నగదును చోరీచేశారు. ఇంటి పక్కన ఉన్న అలుగుబెల్లి ఇంద్రారెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు విఫలయత్నం చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని నల్లగొండ నుంచి క్లూస్‌ టీంను రంగంలోకి దించి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్ని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీ్‌షరెడ్డి తెలిపారు.

Updated Date - Mar 03 , 2025 | 11:43 PM