Share News

Congress MLA's: కాంగ్రెస్ నేతల రహస్య సమావేశం.. వాళ్లే టార్గెట్‌గా..

ABN , Publish Date - Feb 01 , 2025 | 04:20 PM

Telangana: కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారంటూ ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ శివార్లలో సీక్రెట్ మీటింగ్ నిర్వహించారని వినిపిస్తోంది.

Congress MLA's: కాంగ్రెస్ నేతల రహస్య సమావేశం.. వాళ్లే టార్గెట్‌గా..
Congress Party

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైందని ప్రచారం జరుగుతోంది. 11 మంది హస్తం పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ శివార్లలో ఓ హోటల్‌లో రహస్యంగా సమావేశం అయ్యారని పుకార్లు వస్తున్నాయి. ఒక మంత్రి తమను పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేసినట్లు సమాచారం. తమ నియోజకవర్గంలో తమకు తెలియకుండానే మంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారని వినిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలకు ప్రభుత్వంలో పనులు అవుతున్నాయని, కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం ఆలస్యం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ రూమర్స్‌పై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అలర్ట్ అయింది. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయంపై ఫోకస్ చేస్తోందని తెలిసింది. పీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ ఎమ్మెల్యేలకు ఫోన్‌ చేసి కలసి మాట్లాడుకుందామని సముదాయించారని సమాచారం.


వాళ్లే టార్గెట్‌గా!

రహస్యంగా భేటీ అయిన 11 మందిలో నలుగురు పాలమూరు ఎమ్మెల్యేలు అని వినిపిస్తోంది. ఫోన్‌ ద్వారా మరో 6 మంది ఎమ్మెల్యేలు టచ్‌లోకి వచ్చారని సమాచారం. పనులు కాకపోవడం మీద వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. బిల్లుల విషయంలో నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని ఆరోపించారని సమాచారం. ఫైనాన్స్, రెవెన్యూ ఎమ్మెల్యేలు టార్గెట్‌గా ఈ సమావేశం జరిగిందని తెలుస్తోంది. కాగా, రహస్య భేటీ సమాచారాన్ని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖండించారు. ఇది బీఆర్ఎస్ సోషల్ మీడియా దుష్ప్రచారమేనని ఎమ్మెల్యేలు కొట్టిపారేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులతో అంతా సఖ్యతతో కలసి పని చేస్తున్నారని చెబుతున్నారు. పాలన చూసి ఓర్వలేకే ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ సీరియస్ అవుతున్నారు.


ఇవీ చదవండి:

కేంద్ర బడ్జెట్‌పై నేతల రియాక్షన్ ఎలా ఉందంటే...

మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం.. కారణమిదే..

గద్దర్‌కు మరణం లేదు.. ప్రజల హృదయాల్లోనే ఉన్నారు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 01 , 2025 | 04:35 PM