YSRCP: మంచం కింద వైసీపీ నేత రాజకీయం
ABN, Publish Date - Feb 24 , 2025 | 03:38 PM
విజయవాడ వెటర్నరీ కాలనీలోని స్పా సెంటర్‌లో మాచవరం పోలీసులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో పలు విషయాలు బయటపడ్డాయి.
విజయవాడ: విజయవాడలో హైటెక్ వ్యభిచార గృహంలో వైసీపీ నేత, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు శవకర్ నాయక్ అడ్డంగా దొరికిపోయాడు. తరచూ ఈ వ్యభిచార గృహానికి వచ్చి శంకర్ నాయక్ జల్సాలు చేస్తుంటాడు. ఈసారి కూడా అలా వచ్చిన సమయంలో పోలీసులు సోదాలు చేశారు. అయితే పోలీసుల సోదాల్లో తప్పించుకోవడానికి వీలుకాకపోవడంతో మంచం కింద దూరాడు. గదిలోకి వచ్చిన పోలీసులకు మహిళ మాత్రమే కనపడటంతో అనుమానం వచ్చి పోలీసులు వెతికారు.
అయితే మంచం కింద శంకర్ నాయక్ ఉండటాన్ని చూసి పోలీసులు షాక్‌కు గురయ్యారు. స్పా సెంటర్‌లో వ్యభిచారంపై ఓ యువకుడు స్టింగ్ ఆపరేషన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రైడ్ చేశారు. స్పా సెంటర్ నిర్వాహకుడితో సహా 10 మంది యువతులను, 11 మంది విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి యువతులను ఇక్కడకు తీసుకుని వచ్చి స్పా సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సోదాలు చేస్తుండగా పక్క భవనంలోకి యువతులు దూకారని చెప్పారు. పక్క భవనంలోని వాటర్ ట్యాంకు కింద దాక్కున్నారని.. దాక్కున్న వారిని వీడియోలో రికార్డు చేశామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో మెట్రోపై గవర్నర్ కీలక ప్రకటన
ఐదు నిముషాల్లోనే సభ నుంచి వెళ్లిపోయిన జగన్
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 24 , 2025 | 04:44 PM