Home » TOP NEWS
ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ కామ్రాకు మార్చి 31న ముంబై పోలీసులు సమ్లన్లు పంపారు. దీనికి ముందు కూడా ఆయనకు పోలీసులు సమన్లు పంపగా వారం రోజులు గడువు ఇవ్వాలని కామ్రా కోరారు. అయితే అందుకు నిరాకరించిన పోలీసులు రెండోసారి సమన్లు పంపారు.
మయన్మార్, థాయిలాండ్ ప్రాంతాల్లో ఇటీవల సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఇదే సమయంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇలాంటి భూకంపాలు సంభవించడానికి ముందే.. మనం వీటిని ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారత రాజ్యాంగంలోని 222వ నిబంధనలోని క్లాజ్ వన్ ద్వారా రాష్ట్రపతి తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుని భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపి, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలాహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలనే సిఫారసు ఆమోదించారని ఆ ఉత్తర్వు తెలిపింది
ఎలాన్ మస్క్ గ్రోక్ 3కి పోటీగా ఓపెన్ ఏఐ నుంచి GPT 4o పేరుతో సరికొత్త ఇమేజ్ జనరేషన్ టూల్ వచ్చేసింది. ఈ టూల్ వినియోగించి అనేక మంది వారి చిత్రాలను క్రియేట్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
మమతతో జరిగిన చర్చలో మోడరేటర్ మాట్లాడుతూ, ఇండియా ఇప్పటికే యూకేను అధిగమించి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందనీ, 2060 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తొలి స్థానానికి చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయని అన్నారు. ఇందుకు మమత స్పందిస్తూ ''దీనితో నేను విభేదిస్తు్న్నాను'' అని అన్నారు.
రాహుల్ గాంధీ ఇంతకుముందు 2024 సెప్టెంబర్‌లో అమెరికాలో పర్యటించారు. తన పర్యటనలలో భాగంగా డల్లాస్‌కు వెళ్లి టెక్సాస్ యూనివర్శిటీ విద్యార్థులు, టీచర్లతో భేటీ జరిపారు. ప్రవాస భారతీయలను ఉద్దేశించి కూడా మాట్లాడారు.
ఉగాది పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వచ్చింది. 2025 మార్చి 28న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో, కరువు భత్యం (DA)లో 2 శాతం పెంపుదలకి ఆమోదం లభించింది.
మీరు క్రిప్టో యాప్‌లను వినియోగిస్తున్నారా. అయితే జాగ్రత్త. ఎందుకంటే గూగుల్ తాజాగా 17 క్రిప్టో ఎక్స్ఛేంజ్ యాప్‌లను తొలగించింది. ఈ యాప్స్ వినియోగదారుల డేటా భద్రత సహా అనేక విషయాల్లో ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పేటోంగ్టార్డ్ ఆహ్వానం మేరకు థాయ్‌లాండ్ వెళ్తున్న మోదీ.. ఏప్రిల్ 3,4 తేదీల్లో బ్యాంకాక్‌లో జరిగే 'బే ఆఫ్ బెంగాల్ ఇనీషిటేయటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్' సదస్సులో పాల్గొంటారు.
ఆర్థిక సంవత్సరం ముగింపు తేదీ సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో RBI బ్యాంక్ అధికారులకు మార్చి 31న సెలవు రద్దు చేసింది. ఇదే సమయంలో తమ ఆఫీసులు కూడా మార్చి 29 నుంచి 31 వరకు తెరిచే ఉంటాయని ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా స్పష్టం చేశారు.