కుందూ నది ఆధునికీకరణకు శంకుస్థాపన
ABN , First Publish Date - 2021-06-17T04:51:47+05:30 IST
కుందూ నది ఆధునికీకరణలో భాగంగా రాజుపాళెం మండలం గోపల్లె వద్ద బుధవారం కడప ఎంపీ వైఎస్ అవినా్‌షరెడ్డి, మైదుకూరు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి భూమి పూజ చేశారు.

దువ్వూరు, జూన్ 16: కుందూ నది ఆధునికీకరణలో భాగంగా రాజుపాళెం మండలం గోపల్లె వద్ద బుధవారం కడప ఎంపీ వైఎస్ అవినా్‌షరెడ్డి, మైదుకూరు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఏటా అధిక వర్షాలు, వరదలు పోటెత్తే సమయంలో కుందూ నది తీర పంట పొలాలు, గ్రామాలు వరదలో చిక్కుకుని తీవ్రనష్టం వాటిల్లుతోందన్నారు. కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా నుంచి కడప జిల్లాలోని వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె వరకు కుందూ నది వెడల్పు చేసేందుకు 183 కి.మీ. మేరకు రూ.1350 కోట్లతో పనులు ప్రారంభించనున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ సలహా సంఘం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, ఎమ్మార్‌కేఆర్ సంస్థ ప్రతినిధి మధుసూదన్‌రెడ్డి, ఇరిగేషన్ డీఈ బ్రహ్మానందరెడ్డి, ఏఈ మురళీకృష్ణ, వినయ్‌కుమార్, సుబ్బారావు, వైసీపీ నేతలు జయచంద్రారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, పోరెడ్డి నరసింహారెడ్డి, మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు.