Chandrababu: చోరీగాళ్లకు జగన్ మంత్రి పదవి ఇచ్చారు

ABN , First Publish Date - 2022-11-24T15:00:46+05:30 IST

మనుషులుగా తప్పులు చేయటం సహజం.. తప్పులు సరిదిద్దుకోకుంటే మనిషికి పశువుకు తేడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలు గ్రహించి సమస్యలు పరిష్కరించకుంటే చరిత్రహీనులుగా

Chandrababu: చోరీగాళ్లకు జగన్ మంత్రి పదవి ఇచ్చారు
చోరీగాళ్లకు

అమరావతి: కోర్టులో ఫైళ్లను చోరీ చేసే ఘనులకు సీఎం జగన్ (Cm jagan).. మంత్రి పదవి ఇచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ధ్వజమెత్తారు. నెల్లూరు కోర్టులో చోరీ అయిన ఫైళ్ల కేసు విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. మంత్రి కాకాణి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాలతోనైనా సిగ్గుంటే మంత్రి కాకాణి(Minister Kakani Govardhan Reddy)తో జగన్ రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయకుంటే డిస్మిస్ అయినా చేయాలని కోరారు. మరొకరైతే వెంటనే డిస్మిస్ చేసేవారని.. జగన్ మీదే సీబీఐ కేసులున్నాయి కాబట్టే డిస్మిస్ చేయరని విమర్శించారు. దొంగలు.. దోపిడీదారుల బ్యాచ్ తయారై తనపై దాడికి దిగుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

వైసీసీని బంగాళాఖాతంలో పడేయాలి..

వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో పడేస్తే.. వెంటనే అదృష్టం అంటే ఏంటో చూస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘ఇదేం ఖర్మ-రాష్ట్రానికి’ అనే చర్చ గ్రామాల్లో జరగాలన్నారు. వనరులు, తెలివితేటలు మనకున్నా.. రాష్ట్రానికి పట్టిన ఖర్మకు ఏకైక కారణం జగన్మోహన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. మనుషులుగా తప్పులు చేయటం సహజం.. తప్పులు సరిదిద్దుకోకుంటే మనిషికి పశువుకు తేడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలు గ్రహించి సమస్యలు పరిష్కరించకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ప్రజల్లో చైతన్యం తెచ్చి వారి భవిష్యత్తు వివరించేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా వెళ్తున్నానని చంద్రబాబు తెలిపారు.

Updated Date - 2022-11-24T15:00:47+05:30 IST