Sailajanath: ఐదు దశాబ్దాల పాటు కృష్ణ అందించిన సేవలు మరువరానివి, మరుపురానివి
ABN , First Publish Date - 2022-11-15T10:07:45+05:30 IST
కాంగ్రెస్ నేత, ప్రముఖ చలన చిత్ర నటుడు, సినీ హీరో సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల ఏపీసీసీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాధ్ సంతాపం తెలియజేశారు.
విజయవాడ: కాంగ్రెస్ నేత, ప్రముఖ చలన చిత్ర నటుడు, సినీ హీరో సూపర్ స్టార్ కృష్ణ (Supter star Krishna) మరణం పట్ల ఏపీసీసీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్(Sake Sailajanath) సంతాపం తెలియజేశారు. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్ధాల పాటు కృష్ణ అందించిన సేవలు మరువరానివి, మరుపురాని అని అన్నారు. 350కి పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మరణం తెలుగు చిత్ర రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. విభిన్న కుటుంబ కధా చిత్రాలతో పాటు ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడుగా కృష్ణ జనాదరణ పొందారన్నారు. 1989లో ఏలూరు నుంచి కాంగ్రెస్ ఎంపీగా పనిచేసి ప్రజలకు మరిన్ని సేవలందించారని గుర్తుచేశారు. ఇందిరాగాంధీ (Indiragandhi) ఆశయాలకోసం, రాజీవ్ గాంధీ (Rajivgandhi)స్వప్నాల కోసం అహర్నిశలు పనిచేశారని తెలిపారు. కాంగ్రెస్ వాదిగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను చైతన్యం చేసిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ (Super Star) అని అన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు శైలజనాథ్ (APCC Chief) తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.