Raghurama: సొంత చెల్లిని చూసుకోని జగన్‌.. బీసీలను ఏం చూసుకుంటారు...

ABN , First Publish Date - 2022-12-07T15:32:25+05:30 IST

వైసీపీ (YCP) జయహో (Jayahoo) బీసీ (BC) సమావేశం నిర్వహించిందని, మంచి విందు భోజనంతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసిందని ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnamraju) విమర్శించారు.

Raghurama: సొంత చెల్లిని చూసుకోని జగన్‌.. బీసీలను ఏం చూసుకుంటారు...

ఢిల్లీ: బిర్యాని, చికెన్, మటన్, రొయ్యలతో వైసీపీ (YCP) జయహో (Jayahoo) బీసీ (BC) సమావేశం నిర్వహించిందని, మంచి విందు భోజనంతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసిందని ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghur

ama Krishnamraju) విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మట్లాడుతూ సీఎం జగన్ (CM Jagan) సభకు రాకముందే జనం పారిపోతున్నారన్నారు. పెద్ద పోస్టులన్నీ రెడ్లకే కట్టబెట్టారని, కేబినెట్ హోదా ఎంతమంది బీసీలకు, రెడ్లకు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత చెల్లిని చూసుకోని జగన్‌.. బీసీలను ఏం చూసుకుంటారని ఎద్దేవా చేశారు. సీఎం చెప్పేదానికి.. చేసేదానికి పొంతన లేకుండా పోయిందన్నారు. డ్రగ్స్ అమ్మకాల్లో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉందని, డ్రగ్స్, లిక్కర్‌తో ప్రజా జీవితాలను నాశనం చేస్తున్నారని రఘురామ విమర్శించారు.

రెడ్డి సామాజికవర్గం వారికి రూ. 3 లక్షల జీతాలు, బీసీలకు రూ.10 వేల జీతాలని, జగన్ ఏం చేశారో పార్లమెంట్‌లో చెబుతానని రఘురామ అన్నారు. పార్లమెంట్‌లో పెద్ద పోస్ట్ సాయిరెడ్డికి ఇచ్చారని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కన్నా సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy) అధికారం చేలాయిస్తున్నారన్నారు. ఆర్ధికంగా అతిదారుణమైన స్థానానికి దిగజార్చిన ప్రభుత్వం తమదని చెప్పాడానికి సిగ్గు పడుతున్నానన్నానని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Updated Date - 2022-12-07T15:32:29+05:30 IST