వైసీపీ విధానాలను వివరించండి?
ABN , First Publish Date - 2022-11-05T05:49:41+05:30 IST
‘‘వైసీపీ విధానాలను వివరించండి’’ అంటూ.. ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ) డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఎంఏ పొలిటికల్

ఎంఏ పొలిటికల్ పరీక్షలో ప్రశ్న
ఏయూ తీరుపై విద్యార్థుల విస్మయం
పరీక్ష రాసిన జనసేన నాయకుడు
అధికారులపై చర్యలకు డిమాండ్
విశాఖపట్నం, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ విధానాలను వివరించండి’’ అంటూ.. ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ) డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఎంఏ పొలిటికల్ సైన్స్(ప్రీవియ్‌స) పరీక్షలో ప్రశ్న ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా ప్రశ్నలు అడగడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ నిబంధన ప్రకారం ఈ ప్రశ్న అడిగారని విద్యారంగ నిపుణులు ప్రశ్నించారు. ఇదేమైనా స్వాతంత్రోద్యమం కాలం నాటి పార్టీనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలు పతనమవుతున్న తరుణంలో ఓ ప్రత్యేక సిద్ధాంతమంటూ లేని పార్టీ విధానాలపై ఎలా ప్రశ్నలు ఇస్తారని తప్పుబట్టారు. ఇక, ఈ పరీక్షకు హాజరైన కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బాలాజీ ఈ తరహా ప్రశ్న రావడం దౌర్భాగ్యమని అన్నారు. పొలిటికల్ సైన్స్ పేపరులో ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగా ప్రశ్నలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని యూనివర్సిటీ అధికారులను ప్రశ్నించారు. అధికార పార్టీ కనుసన్నల్లో అధికారులు పనిచేస్తున్నారా? అని ప్రశ్నించారు. సంబంధిత ప్రొఫెసర్‌పై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాలాజీ డిమాండ్ చేశారు.