మంచినీటి చెరువును పరిశీలించిన లోకాయుక్త డైరెక్టర్‌

ABN , First Publish Date - 2022-09-15T04:50:51+05:30 IST

వేండ్రలో మంచినీటి చెరువును లోకాయుక్త డైరెక్టర్‌ పి.రాజ్‌కుమార్‌ బుధవారం పరిశీలించారు.

మంచినీటి చెరువును పరిశీలించిన లోకాయుక్త డైరెక్టర్‌
చెరువును పరిశీలిస్తున్న రాజ్‌కుమార్‌

పాలకోడేరు, సెప్టెంబరు 14: వేండ్రలో మంచినీటి చెరువును లోకాయుక్త డైరెక్టర్‌ పి.రాజ్‌కుమార్‌ బుధవారం పరిశీలించారు. 8.68 ఎకరాలు విస్తీర్ణం గల మంచినీటి చెరువు ఆక్రమణలకు గురైందని, ఆక్రమణదారులు భవనాలు నిర్మించి, బాత్‌రూమ్‌ నీరు చెరువులోకి వదులుతున్నా రని, నీరు తాగడానికి పనికి రాదని గ్రామానికి చెందిన కడలి దుర్గారావు 2016లో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. లోకాయుక్త జడ్జి ఆదేశాల మేరకు డైరెక్టర్‌ క్షుణ్ణంగా చెరువును తనిఖీ చేశారు. ఆయన వెంట తహసీల్దార్‌ షేక్‌ హుస్సేన్‌, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-09-15T04:50:51+05:30 IST