Asus Zenbook 17 Fold: ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన ఆసుస్

ABN , First Publish Date - 2022-11-10T19:06:58+05:30 IST

తైవాన్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ ఆసుస్ తాజాగా మరో విప్లవాత్మక ల్యాప్‌టాప్‌ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది

Asus Zenbook 17 Fold: ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన ఆసుస్

న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ ఆసుస్ తాజాగా మరో విప్లవాత్మక ల్యాప్‌టాప్‌ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది. ‘ఆసుస్ జెన్‌బుక్ 17 ఫోల్డ్ ఓలెడ్’ (Asus Zenbook 17 Fold OLED) పేరుతో దీనిని తీసుకొచ్చింది. ఇది ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ ల్యాప్‌టాప్. ఇందులో 17.3 అంగుళాల ఫోల్డబుల్ ఓలెడ్ డిస్‌ప్లే ఉంది. దీనిని ఓ పెద్ద ట్యాబ్లెట్‌లా కానీ, కాంపాక్ట్ మానిటర్‌లా కాని ఉపయోగించుకోవచ్చు. దీనిని ఫోల్డ్ చేస్తే 12.5 అంగుళాల వ్యూయింగ్ ఏరియా ఉంటుంది. మిగతా ఏరియా ఆన్‌బోర్డ్ కీబోర్డులా కనిపిస్తుంది. ఈ స్క్రీన్‌కు ఉన్న రెండు హింజ్‌లు కారణంగా చాలా స్మూత్‌గా ఫోల్డవుతుంది.

zen-book.jpg

కీ బోర్డు లేకుండా దీని బరువు 1.5 కేజీలు. ఇందులో అత్యాధునిక 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7-1250ఓయూ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అలాగే, 16జీబీ 5200మెగా హెర్ట్జ్‌ ఎల్‌పీడీడీఆర్‌5 ర్యామ్‌, 1టీబీ పీసీఎల్‌ఈ 4.0 ఎస్ఎస్‌డీ ఉంది. ఆసుస్ జెన్‌బుక్ 17 ఫోల్డ్ ఓలెడ్ ధర రూ.3,29, 990. ముందుస్తు బుకింగ్ ద్వారా రూ. 2,84,290కే పొందొచ్చు. ఈ ల్యాప్‌టాప్ ఆవిష్కరణ అనంతరం ఆసుస్ ఇండియా బిజినెస్ హెడ్ (కన్జ్యుమర్ అండ్ గేమింగ్ పీసీ, సిస్టమ్ బిజినెస్ గ్రూప్) ఆర్నాల్డ్ మాట్లాడుతూ.. తమ అత్యద్భుత ఆవిష్కరణను భారత మార్కెట్లో విడుదల చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ఇది తొలి 17.3 అంగుళాల ఫోల్డబుల్ ల్యాప్‌టాప్ అని అన్నారు.

Updated Date - 2022-11-10T19:06:59+05:30 IST