Football legend : పీలే మృతితో ఫుట్‌బాల్ ప్రపంచం షాక్
ABN , First Publish Date - 2022-12-30T05:25:16+05:30 IST
కేన్సరుతో బాధపడుతున్న పీలే మృతితో ఫుట్‌బాల్ ప్రపంచం షాక్‌కు గురైంది....
న్యూఢిల్లీ: కేన్సరుతో బాధపడుతున్న పీలే మృతితో ఫుట్‌బాల్ ప్రపంచం షాక్‌కు గురైంది.(Football legend Pele) బ్రెజిల్ ఫుట్‌బాల్ ఆటగాడు పీలే మృతికి ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ క్రీడాకారులు, అభిమానులు సంతాపం తెలిపారు. క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ, కైలియన్ ఎంబాప్పే, సెర్గియో రామోస్, మెసుట్ ఓజిల్ వంటి ఆటగాళ్లు పీలే మృతికి సంతాపం తెలిపారు. ఈ మేర తమ సోషల్ మీడియా పోస్ట్‌లతో పీలేకు నివాళులర్పించారు.
గతంలో పీలే కొవిడ్ వల్ల శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాడు. 82 సంవత్సరాల వయసులో కన్నుమూసిన పీలే మొదటి ప్రపంచ సూపర్ స్టార్‌గా నిలిచారు.గత ఏడాది సెప్టెంబరు నెలలో పీలేకు శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించాక, అతను పెద్దప్రేగు కేన్సర్‌కు గురయ్యాడని పరీక్షల్లో తేలింది. కేన్సరు వ్యాధికి(Cancer) పీలే పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు.(passes away)
బ్రెజిల్ దేశానికి చెందిన (Brazil)పీలే 1958వ సంవత్సరంలో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ తో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. పీలే రెండు ప్రపంచ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు.ఈయన 1958, 1962, 1970సంవత్సరాల్లో మూడు ప్రపంచ కప్‌లను గెలుచుకున్నాడు.అంతర్జాతీయ స్థాయిలో పీలే తన దేశం యొక్క ఆల్-టైమ్ టాప్ స్కోరర్‌గా మిగిలారు. ఫీఫా వరల్డ్ కప్ 1958వ సంవత్సరంలో బెస్ట్ యంగ్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు.ఫుట్‌బాల్ లెజెండ్ పీలేకు నివాళులు అర్పిస్తూ మెసూట్ ఓజిల్ ఓ చిత్రాన్ని ట్విట్టరులో పోస్టు చేశారు.