Share News

టీడీపీ రాష్ట్ర నాయకులకు ఘన స్వాగతం

ABN , First Publish Date - 2023-11-06T00:02:25+05:30 IST

అనంత ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో కరువు పరిశీలించేందుకు ఆదివారం రాత్రి జిల్లాకు వచ్చిన టీడీపీ రాష్ట్ర బృందం నాయకులకు ఘన స్వాగతం లభించింది.

టీడీపీ రాష్ట్ర నాయకులకు ఘన స్వాగతం
టీడీపీ సభ్యులకు స్వాగతం పలుకుతున్న కాలవ శ్రీనివాసులు, నాయకులు

అనంతపురం అర్బన, నవంబరు 5: అనంత ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో కరువు పరిశీలించేందుకు ఆదివారం రాత్రి జిల్లాకు వచ్చిన టీడీపీ రాష్ట్ర బృందం నాయకులకు ఘన స్వాగతం లభించింది. ఆ బృందంలో మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఉన్నారు. స్థానిక మాసినేని హోటల్‌ వద్ద టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీఽధర్‌ చౌదరి, గంజే నాగరాజు, నాయకులు సరిపూటి రమణ, నారాయణస్వామి యాదవ్‌, బ్రహ్మయ్య, షణ్ముఖ, రజాక్‌, సరిపూటి శ్రీకాంత స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

Updated Date - 2023-11-06T00:02:26+05:30 IST