AP HighCourt: ఆర్ -5 జోన్‌పై రైతుల పిటిషన్‌ను తిరస్కరించిన ఏపీ హైకోర్టు
ABN , First Publish Date - 2023-05-05T15:19:32+05:30 IST
ఆర్ -5 జోన్‌పై రైతులు వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది.

అమరావతి: ఆర్ -5 జోన్‌పై రైతులు వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు (AP HighCourt) తిరస్కరించింది. శుక్రవారం ఆర్ -5 జోన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్-5జోన్ ఏర్పాటు, ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను నిలిపివేయాలంటూ రాజధాని రైతులు మధ్యంతర ఉత్తర్వులు కోరారు. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సీజే ధర్మాసనం నిరాకరించింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు తుది తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు తెలిపింది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం అభివృద్ధి చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్‌ను ఆర్ - 5జోన్‌గా మార్చి పేదలకు ఇళ్ల స్థలాల కోసం 1134 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. అయితే రైతుల పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో రేపు (శనివారం) సుప్రీంకోర్టుకు అమరావతి రాజధాని రైతులు వెళ్లనున్నారు. సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేయాలని రైతులు నిర్ణయించారు.