ACB court: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదోపవాదనలు
ABN , First Publish Date - 2023-10-05T17:08:27+05:30 IST
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో (ACB court) న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు జరిగాయి.

విజయవాడ: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో (ACB court) న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. సీఐడీ, చంద్రబాబు న్యాయవాదుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనను బెదిరిస్తున్నారంటూ పొన్నవోలును ఉద్దేశించి ప్రమోద్ కుమార్ దూబే మండిపడ్డారు.
"నేనేం భయపెట్టడం లేదు.. నా వాదనలు వినిపిస్తున్నా." అని పొన్నవోలు అన్నారు.
దీంతో కాసేపు కోర్టు హాల్లో గందరగోళం నెలకొంది. ఈ వ్యవహారంపై ఆగ్రహించిన జడ్జి.. ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో సీఐడీ తరపున వాదిస్తున్న అదనపు న్యాయవాది పొన్నవోలు కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చేశారు. ఇరుపక్షాలకూ వాదనలు వినిపించే అవకాశం మళ్లీ ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. ఈ కోర్టు హాల్లో తాను బాధితుడిగా మారానని దూబే పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను రేపు మధ్యాహ్నానికి వాయిదా వేశారు.