Nageshwarrao: తిరుమలలో ఎక్కువగా చిరుతల కదలికలకు కారణం ఏంటో చెప్పిన పీసీఎఫ్
ABN , First Publish Date - 2023-08-23T12:25:01+05:30 IST
తిరుమల నడకదారిలో చిరుతలను పట్టుకునేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినట్లు పీసీఎఫ్ నాగేశ్వర రావు తెలిపారు.
తిరుపతి: తిరుమల నడకదారిలో చిరుతలను పట్టుకునేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినట్లు పీసీఎఫ్ నాగేశ్వర రావు తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జూలై నుంచి సెప్టెంబర్ వరకు జంతువులు సంపర్కం సమయం వల్ల ఎక్కువగా చిరుతల కదలికలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తిరుమల నడకదారిలో 300 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 100 మంది సిబ్బంది క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నామని.. మోకాళ్ళ మెట్టు, నరసింహ స్వామి ఆలయం వద్ద ట్రంక్ లైజింగ్ ఎక్వింప్మెంట్ సిద్ధంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మెట్ల మార్గంలో వంద మంది గ్రూప్‌లుగా వెళ్ళాలని, టీటీడీ నుంచి సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్నారు. చిరుత, ఎలుగు బంటి కూడా ఈ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాయన్నారు. నడక మార్గంలో భక్తులు సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. లక్షితను చంపినది చిరుతనే అని.. పట్టుకున్న రెండు చిరుతలో ఏది అనేది రిపోర్ట్ రావాల్సి ఉందని అన్నారు. 80 చోట్ల శ్రీవారి మెట్టు ప్రాంతంలో ఫారెస్ట్ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక చిరుత, ఎలుగు బంటి మాత్రమే ఉన్నాయన్నారు. వైల్డ్ లైఫ్ ఇండియా వారి గైడ్ లైన్స్ ప్రకారం కంచే ఏర్పాటుపై నిర్ణయం ఉంటుందన్నారు. మహారాష్ట్ర నుంచి కొన్ని బోనులు తీసుకువచ్చామని.. వాటిని కొన్ని రీమోడల్ చేస్తున్నామని అన్నారు. కంఫా ఫండ్స్‌తో అటవీ సమీప ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని నాగేశ్వరరావు వెల్లడించారు.