రహదారి మూసివేతపై కదిలిన అధికారులు

ABN , First Publish Date - 2023-04-09T00:09:02+05:30 IST

లీజుకు తీసుకున్న భూములకు గుత్తేదారుడు సొమ్ములు చెల్లించకపోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు రహదారిని మూసివేసి తమ నిరసన వెల్లగక్కారు. ఈ ఘటనపై శనివారం ఆంధ్రజ్యోతిలో అన్నదాత నిరసన శీర్షికతో వెలువడిన కథనానికి అధికారులు స్పందించారు. కాకినాడరూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆదేశాల మేరకు రైతులు కంచెతో మూసివేసిన వేములవాడ-గొర్రిపూడి ఏటిగట్టు

రహదారి మూసివేతపై కదిలిన అధికారులు
కంచెను తొలగిస్తున్న దృశ్యం

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

రైతులతో మాట్లాడి కంచె తొలగింపు

కరప, ఏప్రిల్‌ 8: లీజుకు తీసుకున్న భూములకు గుత్తేదారుడు సొమ్ములు చెల్లించకపోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు రహదారిని మూసివేసి తమ నిరసన వెల్లగక్కారు. ఈ ఘటనపై శనివారం ఆంధ్రజ్యోతిలో అన్నదాత నిరసన శీర్షికతో వెలువడిన కథనానికి అధికారులు స్పందించారు. కాకినాడరూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆదేశాల మేరకు రైతులు కంచెతో మూసివేసిన వేములవాడ-గొర్రిపూడి ఏటిగట్టు రోడ్డును తహశీల్దార్‌ పొన్నమండ శ్రీనివాసరావు, ఎస్‌ఐ నౌడు రామకృష్ణ, ఇతర సిబ్బం ది పరిశీలించారు. రహదారిని దిగ్భందించి మూ డు చోట్ల కంచెలు ఏర్పాటుచేసిన రైతులను పిలి చి విచారించారు. కొంగోడు నుంచి తుల్యబాగ డ్రైన్‌ మీదుగా వేములవాడ-గొర్రిపూడి ఏటిగట్టు రోడ్డుకు రూ.5.19కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి 2017 చివరలో శంకుస్థాపన జరిగిందని, అయితే ఈ పని దక్కించుకున్న గుత్తేదారుడు అప్రోచ్‌ రోడ్డు, తుల్యబాగ కాలువ డైవర్షన్‌ కోసమని తమవద్ద సుమారు 5ఎకరాలు లీజుకు తీసుకున్నాడని వివరించారు. రెండేళ్లు సక్రమంగా తమ లీజు చెల్లించిన సదరు గుత్తేదారుడు బ్రిడ్జి పనులు ఆపేయడంతో బాటు తమ లీజును నిలిపివేశాడన్నారు. తమ లీజు ఇవ్వాల్సిందిగా గుత్తేదారుడు, అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో వేరే దారి లేక రహదారిని దిగ్భందించినట్టు రైతులు మేడిశెట్టి రాధాకృష్ణ, చంటి, మణికుమార్‌ తెలిపారు. అయితే పబ్లిక్‌ రహదారిని మూసివేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం చట్టప్రకారం నేరంగా పరిగణించాల్సి ఉంటుందని తహశీల్దార్‌, ఎస్‌ఐ హెచ్చరించారు. గుత్తేదారుడితో మీకున్న అగ్రిమెంట్‌ పేపర్లను తీసుకువస్తే అతనితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. అధికారుల సూచనల మేరకు రైతులు కంచెలను తొలగించడంతో వేమలవాడ-గొర్రిపూడి ఏటిగట్టు రోడ్డులో రాకపోకలు ప్రారంభమయ్యాయి.

Updated Date - 2023-04-09T00:09:02+05:30 IST