Ayyanna Patrudu: సీఎం జగన్‌పై అయ్యన్న సంచలన వ్యాఖ్యలు..
ABN , First Publish Date - 2023-04-29T13:16:35+05:30 IST
తూ.గో. జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu) సంచలన వ్యాఖ్యలు చేశారు.
తూ.గో. జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ (Kakinada)లో జరిగిన బీసీ ఐక్య కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశం (BC United Action Roundtable Meeting)లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ (BC)లను అణగదొక్కుతున్నారని, 2500 మంది పోలీసులు లేనిదే ముఖ్యమంత్రి బయటికి రాలేని పరిస్థితని విమర్శించారు. జైలుకు వెళ్లి వచ్చిన సీఎంకు పోలీసులు కాపలా..? అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ సెంటిమెంట్ చర్లపల్లి జైలుకు వెళ్లిరావడమేనని అన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు పోలవరంపై అవగాహన లేదని విమర్శించారు. ఏపీలో బీసీ మంత్రుల పేర్లు ఎంతమందికి తెలుసునని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.
నాలుగేళ్లలో రూ. 45వేల కోట్లు విలువ చేసే ప్రైవేట్ భూములు బలవంతంగా లాక్కున్నారని ఇదేనా పరిపాలన విధానమని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలను సీఎం జగన్ రూ. 25వేల కోట్లకు బ్యాంకుల్లో తాకట్టు పెట్టారని ఆరోపించారు. చివరికి బ్రాందీ షాపులను కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో మద్యం షాపులు బంద్ అని జగన్ పాదయాత్రలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా అయ్యన్న గుర్తు చేశారు. ఒక్క మాట నిలబెట్టుకోలేదని, అబద్దాలతో రాష్ట్ర ప్రజలను జగన్మోహన్ రెడ్డి మోసం చేసిన దుర్మార్గుడని అన్నారు. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతున్నందుకు టీడీపీ నేతలపై కేసులు పెట్టి.. జైలుకు పంపుతున్నారని, తనపై ఏకంగా 14 కేసులు పెట్టారని అన్నారు. కాకపోతే ఒక కేసు విషయంలో బాధపడ్డానన్నారు. ఈ వయసులో తనపై రేప్ కేసు పెట్టారని అన్నారు. ఇటువంటి దైర్భగ్యపరిపాలన రాష్ట్రంలో జరుగుతోందని, న్యాయం చేయాల్సిన పోలీస్ డిపార్టుమెంట్ కూడా అలాగే ఉందని అయ్యన్న తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.