NCBN Arrest : 40 రోజులుగా జైలులోనే చంద్రబాబు.. విడుదలకు ఎదురుచూపులు!
ABN , First Publish Date - 2023-10-20T00:33:50+05:30 IST
చంద్రబాబు వచ్చేస్తారు..వచ్చేస్తారు.. నిన్నటి వరకు ఎవరి నోట విన్నా ఇదేమాట.. ఎక్కడ చూసినా అదే చర్చ. అయితే ఆ మాట రోజురోజుకూ దూరమవుతుం డడంపై అటు ప్రజలు..ఇటు నాయకులు, అభిమానుల్లో నిరాశ పెరుగుతూనే ఉంది.. సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఆరోగ్యం ఇటీవల క్షీణించ డంతో బెయిల్ వస్తుందని ఆశించారు. అయితే గురు వారం కూడా చుక్కెదురైంది.

నేటి సుప్రీం తీర్పుపై తీవ్ర ఉత్కంఠ
రోజులు లెక్కపెట్టుకుంటున్న వైనం
ఎక్కడ చూసినా బాబు కేసుపైనే చర్చ
40 రోజులుగా జైలులోనే చంద్రబాబు
నేడో..రేపో విడుదలవుతారని ఆశ
ఆరోగ్యంపై పెరుగుతున్న ఆందోళన
వర్చువల్‌గానే కోర్టుకు హాజరు
ప్రభుత్వం సాధించిందేమిటని ప్రశ్న
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
చంద్రబాబు వచ్చేస్తారు..వచ్చేస్తారు.. నిన్నటి వరకు ఎవరి నోట విన్నా ఇదేమాట.. ఎక్కడ చూసినా అదే చర్చ. అయితే ఆ మాట రోజురోజుకూ దూరమవుతుం డడంపై అటు ప్రజలు..ఇటు నాయకులు, అభిమానుల్లో నిరాశ పెరుగుతూనే ఉంది.. సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఆరోగ్యం ఇటీవల క్షీణించడంతో బెయిల్ వస్తుందని ఆశించారు. అయితే గురువారం కూడా చుక్కెదురైంది. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండుకు వెళ్లి 40 రోజులు దాటింది. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్లు సీఎం పదవిలో వున్న ఆయన ఇన్ని రోజుల పాటు జనానికి కనిపించకుండా ఉండడం ఇదే మొదటిసారి. దీంతో అభిమానులు రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహానికి సంస్కారంతో సర్దిచెప్పుకుంటున్నారు.
ఎక్కడ చూసినా ఒకటే చర్చ...
ప్రస్తుతం ఎక్కడ చూసినా చంద్రబాబు అంశంపైనే చర్చ సాగుతోంది. మార్కెట్లు, బస్సులు, కూడళ్లు, వేడు కలు.. ఒక్కచోట కాదు. నలుగురు జనం ఎక్కడ పోగైనా చంద్రబాబు అంశమే చర్చకు వస్తోంది. ఈ రోజు సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్‌పై విచారణ ఉందట... చంద్రబాబు ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని అయి నా బెయిల్‌కి ఒప్పుకుంటుందేమో అంటూ మాట్లాడు కుంటున్నారు.అభిమానులైతే రోజులు లెక్కపెట్టుకుంటు న్నారు. ఇక చంద్ర బాబు ఆరోగ్యంపై జనాల్లో ఆందోళన రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందంటూ హెల్త్ బులెటిన్‌లో అధికారులు పేర్కొంటున్నారు. అయితే వైద్యులు ఇచ్చిన నివేదిక ప్రకారం అంటూ జైలు సూపరింటెండెంట్ ఆ బులెటిన్ ఇస్తున్నారు.వైద్యులు ఇచ్చిన నివేదికను అసలు బయ టకు రానీయడం లేదు. ఒక్కోసారి చంద్రబాబు బరువును చూపకుండా ఇస్తున్నారు. కీలకమైన షుగర్ లెవెల్స్ (మధుమేహ స్థాయిలు) గురించి బయట ప్రపంచానికి ఇప్పటివరకు ఏమీ తెలియదు. మరోవైపు ఆయన ఆరోగ్యం అంత బాగోలేదని.. జైలుకు వచ్చినప్ప టికీ ఇప్పటికీ తేడా వచ్చిందని తెలుస్తోంది. గురువారం కోర్టు ముందు ప్రవేశపెడితే చంద్రబాబును చూడొచ్చని వేలాది జనం ఎదురు చూశారు. కానీ వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టడంతో నిరాశే మిగిలింది.
సాధించిందేమిటి!?
మన రాష్ట్రంలో ఎన్నడూ లేని రాజకీయ కక్ష అనే దరిద్ర సంప్రదాయానికి జగన్ తెరతీశారనేది జగమె రిగిన వాస్తవం. దీనిపై ప్రజల్లోంచి ఎన్ని ఆగ్రహావేశాలు, ఆందోళనలు వ్యక్తమైనా ప్రభుత్వం కళ్లుతెరవడం లేదు. చంద్రబాబును ఇన్ని రోజులు బంధించి అహాన్ని సం తృప్తిపరచుకోవడం మినహా పాలకులు కొత్తగా సాధిం చిందేమిటని ప్రజలు నిలదీస్తున్నారు. అభిమానులే కాకుండా కుల, మత, రాజకీయాలకు అతీతంగా చంద్ర బాబు విషయంలో జగన్ అనుసరిస్తున్న దారి కచ్చి తంగా తప్పనే విమర్శలకు కొదువలేదు. చంద్రబాబుకు మద్దతుగా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. రాజకీయ వికృత క్రీడను పక్కన పెడితే.. 73ఏళ్ల వయసులో ఉన్న ఒక మాజీ సీఎంని ఇంతలా ఇబ్బందులకు గురిచేయ డం అవసరమా అనే ప్రశ్నకు ఎవరు సమాధానం చె బుతారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటారనేది రాజకీయాలకు అతీతంగా అందరూ ఒప్పుకునే మాటే. దానిని రుజువు చేయడానికి విశాఖ హుద్‌హుద్ తుఫాను విషయంలో ఆయన స్పందించిన తీరు చాలు. మరి అలాంటి వ్యక్తిని పెద్ద వయసు అని కూడా చూడకుండా అరెస్టు చేయడం... ఆపైన ఇబ్బందులకు గురిచేయడం భావ్య మేనా? అని ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భువనేశ్వరికి సంఘీ భావం తెలియజేయడానికి వస్తున్న వారిని నిలువరించడం, కేసులు బనాయించడంపై విస్తుపోతున్నారు.
ఎన్నికల వేళ ఎందుకిలా?
చట్టాన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా అనుసరించా ల్సిందే. దాంట్లో ఎలాంటి సందేహానికీ తావులేదు. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పుడు అరెస్టు చేయడం కచ్చితంగా ఆయనను ప్రజలకు దూరం చేయాలనే దురాచనలో భాగమేనని ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిని నిజం చేస్తూ కేసులపై కేసులు బనాయిస్తున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో లేనివన్నీ ఇప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుండడం వాటికి బలాన్ని చేకూరుస్తోంది. ఇన్నేళ్లుగా పారిపోని చంద్రబాబు ఇప్పుడు ఎక్కడికి పోతారు?.. ఆయనకు అలాంటి ఆలోచనలు ఉంటే ప్రజల్లో ఎందుకు తిరుగుతారు?. ఆరోగ్యం క్షీణిస్తున్నా కనికరం ఎందుకు కరువవుతోంది? ఆయనకు ఇంతటి నిర్బంధం అవసరమా? పైగా ఆయన కేసుల్లో ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సొమ్ము ఎవరిది? ప్రజల సొమ్ము కాదా? అని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. జగన్ పదేళ్లకు పైగా బెయిల్‌పైనే ఉన్నారని, ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదని ఎత్తిచూపుతున్నారు. సీఎం జగన్ తనపై 34 కేసులు పెట్టుకుని చంద్రబాబును ఇరికించడం తగదంటున్నారు.
భద్రతపై అనుమానాలు
సెంట్రల్ జైలులో తన భద్రత విషయంలో అనుమానాలు ఉన్నాయని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయమూర్తితో స్వయంగా చెప్పడంతో ఆయన భద్రత విషయం మళ్లీ చర్చనీయాంశమైంది. దీంతో అటు ప్రజలు, ఇటు అభిమానులు, టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. రాజ మహేంద్రవరం సెంట్రల్ జైలులో సుమారు 41 రోజులుగా చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. జైలు అధికారులు ఆయనకు 1+5 భద్రత ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. చంద్రబాబు సెంట్రల్ జైలుకు వెళ్లినపుడు ఎవరో ఫొటోలు, వీడియోలు తీయడం, బయటకు రావడంతో లోపలే ఏదైనా కుట్ర జరుగుతుందేమోననే అనుమానాలు ఇప్పటికే నారా లోకేశ్‌తో పాటు, పార్టీనేతలంతా వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే. సెంట్రల్ జైలు ఆవరణలో ఓ డ్రోన్ కూడా ఎగరడం, దానిపై ఇప్పటివరకూ అధికారులు ఆరా తీయకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. జైలు లోపల మావోయిస్టులు, గంజాయి, ఎర్రచందనం దొంగలు ఉండడం వల్ల సమస్య ఏదైనా ఉంటుందనే ఆందోళన చంద్రబాబు కుటుంబీకులు, పార్టీ వర్గాలు, ప్రజల్లోనూ కలగడం గమనార్హం. ఇటీవల టీడీపీ నేతలు డీఐజీకి రాసిన లేఖలో ఇవన్నీ ప్రస్తావించారు ఇదిలా ఉండగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకు వర్చువల్ విధానంలో హాజరైన చంద్రబాబు భద్రత విషయంలో అనుమానాలు ఉన్నాయని జడ్జికి చెప్పారు. దీనిపై స్పందించిన జడ్జి అవి రాతపూర్వకంగా అందివ్వాలని సూచించారు. సెంట్రల్ జైలు అధికారులకు ఆదేశించారు. తన భద్రత విషయంలో అనుమానాలున్నాయని బాబే నేరుగా చెప్పడంతో ప్రజలు, అభిమానుల్లో ఆందోళన పెరిగింది.
చంద్రబాబుకు ఉపశమనం లేదు
గోకవరం : దేశానికి అవసరమైన నాయకుడిని అరెస్ట్ చేసి జగన్ సైకో ఆనందం పొందుతున్నాడు.. 40 రోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలు చేస్తోంది. జైలులో ఇచ్చే మందులతో చంద్రబాబుకు ఉపశమనం కలగడం లేదు. ఈ విషయాన్ని డీఐజీకి వివరించినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కనీసం కుటుంబీకులకు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేయడం లేదు. పదేళ్లుగా బెయిల్‌పై తిరుగుతున్న జగన్ చంద్రబాబు తప్పుచేశాడని ఆరోపించడం, జైల్లో పెట్టి ఆనందపడడం సరికాదు. త్వరలోనే జగన్ జీవిత ఖైదీగా శిక్ష అనుభవించక తప్పదు. చంద్రబాబుపై కుట్ర పూరిత కేసులు బనాయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
- జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే, జగ్గంపేట