Laxminarayana: విశాఖ స్టీల్ క్రౌడ్ ఫండ్‌ శ్రీకారానికి సీబీఐ మాజీ జేడీ ఏ ప్రాంతాన్ని ఎంచుకున్నారంటే..

ABN , First Publish Date - 2023-04-17T13:29:36+05:30 IST

విశాఖ స్టీల్ ప్లాంట్ క్రౌడ్ ఫండ్ అమలాపురం నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు.

Laxminarayana: విశాఖ స్టీల్ క్రౌడ్ ఫండ్‌ శ్రీకారానికి సీబీఐ మాజీ జేడీ ఏ ప్రాంతాన్ని ఎంచుకున్నారంటే..

అంబెడ్కర్ కోనసీమ: విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) క్రౌడ్ ఫండ్ అమలాపురం నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ (Former CBI JD Lakshminarayana) ప్రకటించారు. సోమవారం అమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ.. అమలాపురం నుంచే స్టీల్ ప్లాంట్ క్రౌడ్ ఫండ్‌ను ప్రారంభిస్తామన్నారు. ఏదైనా అమలాపురం నుంచి ప్రారంభించాలని అనుకునేవాడిని అందుకే ఇక్కడి నుంచే సంకల్పించనట్లు చెప్పారు. రాష్ట్రంలో 8.5 కోట్ల కుటుంబాలు ఉన్నాయని.. ప్రతి ఒక్కరూ 100 రూపాయల చొప్పున ఇవ్వగలిగితే నెలకు రూ.850 కోట్లు వస్తాయని వివరించారు. రూ.850 కోట్లు ఒక నాలుగు నెలలు ఇవ్వగలిగితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన చేతుల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ 100 రూపాయలు ఇవ్వాలని కోరారు. ఏదైనా చేద్దాం అంటే వెనక్కు లాగేవాళ్ళు చాలామంది ఉంటారన్నారు. ఏసీ రూములలోను, టీవీల ముందు చెప్పేవారు ఉంటారని.. కానీ తాము మిట్టమధ్యాహ్నం నిర్ణయించుకున్నామని అన్నారు. ప్రపంచంలోనే చరిత్ర సృష్టించ బోతున్నామని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ధీమా వ్యక్తం చేశారు.

కాగా... విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐ బిడ్డింగ్ గడువును యాజమాన్యం మరో ఐదు రోజుల పాటు పొడిగించిని విషయం తెలిసిందే. మొదట ఈవోఐ బిడ్ల సమర్పణకు ఏప్రిల్ 15 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుగా నిర్ణయించగా.. దాదాపు 22 కంపెనీలు బిడ్‌లు దాఖలు చేసినట్లు సమాచారం. అయితే మరో ఐదు రోజుల పాటు అంటే ఈనెల 20 వరకు బిడ్‌లను సమర్పించేందుకు యాజమాన్యం గడవు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే విశాఖ‌ స్టీల్‌ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొంటామంటూ తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ప్రచారం చేసింది. అయితే ఆ సమయం వచ్చే సరికి తెలంగాణ మంత్రుల ప్రచారం ప్రచారంగా మిగిలిపోయింది. ఈవోఐ బిడ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనలేదు. అయితే తదుపరి ఈవోఐ బిడ్‌లో అయినా తెలంగాణ పాల్గొంటుందో లేదా అనేది చూడాలి. మరోవైపు ప్రజల తరఫున బిడ్ వేస్తానంటూ ముందుకొచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (VV Lakshmi Narayana) అన్నట్లుగానే బిడ్ దాఖలు చేశారు. క్రౌండ్ ఫండింగ్ నిధులు సేకరిస్తామని లక్ష్మీ నారాయణ ప్రకటించారు.

The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-04-17T13:29:36+05:30 IST