Ambati rambabuకు కోర్టు ఝలక్! కేసు నమోదుకు ఆదేశం
ABN , First Publish Date - 2023-01-11T12:14:08+05:30 IST
మంత్రి అంబటి రాంబాబు (Ambati rambabu)కు కోర్టు ఝలక్ ఇచ్చింది. మంత్రిపై కేసు నమోదుకు న్యాయస్థానం ఆదేశించింది. సంక్రాంతి డ్రా పేరుతో వైసీపీ (YCP) సత్తెనపల్లి
గుంటూరు: మంత్రి అంబటి రాంబాబు (Ambati rambabu)కు కోర్టు ఝలక్ ఇచ్చింది. మంత్రిపై కేసు నమోదుకు న్యాయస్థానం ఆదేశించింది. సంక్రాంతి డ్రా పేరుతో వైసీపీ (YCP) సత్తెనపల్లి (Sattenapally)లో వసూళ్లకు పాల్పడినట్లు జనసేన ఆరోపించింది. మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో లక్కీ డ్రా (Lucky draw) టికెట్లు బలవంతంగా అమ్మకాలు చేసింది అని పేర్కొన్నారు. దీంతో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం మంత్రిపై కేసు నమోదు చేయకపోవడంతో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు.. తక్షణమే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశించింది.
ఇటీవల మంత్రి అంబటి రాంబాబుపై జనసేన (Janasena) నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చిన సాయం నుంచి లంచం అడిగారని అంబటి రాంబాబుపై జనసేన ఆరోపించింది.