AP News: ఈనెల 30న చలో శృంగవరపుకోటకు మాలమహానాడు పిలుపు | Mala Mahanadu called to Chalo Shringavarapukota On 30th March Andhrapradesh Suchi

AP News: ఈనెల 30న చలో శృంగవరపుకోటకు మాలమహానాడు పిలుపు

ABN , First Publish Date - 2023-03-24T11:50:17+05:30 IST

తునిలో దళిత యువకుడు రాజు హత్యకు నిరసనగా ఈనెల 30న చలో శృంగవరపుకోటకు మాలమహానాడు పిలుపునిచ్చింది.

AP News: ఈనెల 30న చలో శృంగవరపుకోటకు మాలమహానాడు పిలుపు

గుంటూరు: తునిలో దళిత యువకుడు రాజు హత్యకు నిరసనగా ఈనెల 30న చలో శృంగవరపుకోట (Chalo Sringavarapukota)కు మాలమహానాడు (Malamahanadu) పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్ (Mala Mahanadu National President Golla Arun Kumar) మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ (YCP) పాలనలో దళితులను చంపి వెల కడుతున్నారని మండిపడ్డారు. తుని నియోజకవర్గంలో తాజాగా రాము అనే దళిత యువకుడిని కొట్టి చంపారని... మంత్రి దాడిశెట్టి రాజా (Minister Dadisetti Raja) అనుచరులే దళిత యువకుడుని హత్య చేశారని ఆరోపించారు. మంత్రి ఒత్తిడితో అసలైన నిందితులను కేసు నుంచి తప్పించారని అన్నారు. దళితులను చంపడానికి సబ్ ప్లాన్ నిధులు కేటాయించినట్లుగా ఉందని వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 30న ఛలో శృంగవరపుకోటకు పిలుపునిచ్చారు. తక్షణమే అసలైన నిందితుడటలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హత్యకు గురైన దళిత యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. దళితుల సమస్యలపై అసెంబ్లీ (AP Assembly) లో చర్చ లేదన్నారు. దళితులను దళితుల చేతే అసెంబ్లీలో దాడి చేయించి తమను రాజకీయంగా వాడుకుంటున్నారని అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాన్‌పాల్ (Jaanpal is the Working President of Mala Mahanadu State)మాట్లాడుతూ... దళితులపై హత్యలు జరిగితే నష్ట పరిహారం ఇవ్వడానికే ప్రభుత్వం పరిమితమైందన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో ఇంకా వివక్ష కొనసాగుతుందన్నారు. శృంగవృక్షంలో దళితుడైన రాము కాలు తగిలిందని అగ్రవర్ణాల వారు కొట్టి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి దాడిశెట్టి రాజా వత్తిడితో కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. జగన్‌కు పట్టం కట్టిన మాలలపైనే వైసీపీ దాడులు చేస్తున్నారన్నారు. దళితున్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత్ బాబుకు వైసీపీ ఘన స్వాగతం పలకడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని జోద్యం చూస్తున్నారనా జాన్‌పాల్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-03-24T11:50:47+05:30 IST