Prathipati Pulla Rao: మాజీ సీఎం లేఖ రాయడం నేరమా?
ABN , First Publish Date - 2023-10-23T14:46:25+05:30 IST
చంద్రబాబు ప్రజలకు లేఖ రాస్తే వైసీపీ నేతలు నానాయాగీ చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) ధ్వజమెత్తారు.

పల్నాడు: చంద్రబాబు ప్రజలకు లేఖ రాస్తే వైసీపీ నేతలు నానాయాగీ చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మాజీ సీఎం రాష్ట్ర ప్రజలకు ఒక లేఖ రాయడం కూడా నేరమా?, జైల్లోని వీడియోలు విడుదల చేసినప్పుడు నిబంధనలు గుర్తురాలేదా?, చంద్రబాబు భద్రతపై అనుమానాలు పెంచేలా జైలు అధికారుల తీరు. చంద్రబాబు ఆరోగ్యంపై నిజాలు దాచిపెడుతున్నారు. రోజువారీ హెల్త్‌బులిటెన్‌లు ఇస్తున్న తీరే అందుకు నిదర్శనం. అరకొర వివరాలతోనే చంద్రబాబు హెల్త్ బులిటెన్ ఇస్తున్నారు.’’ అని పుల్లారావు వ్యాఖ్యానించారు.