Janasena: పవన్ వారాహి యాత్ర వివరాలు తెలిపిన జనసేన నేత

ABN , First Publish Date - 2023-09-30T10:36:50+05:30 IST

రేపటి (అక్టోబర్ 1) నుంచి కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలుకానుంది.

Janasena: పవన్ వారాహి యాత్ర వివరాలు తెలిపిన జనసేన నేత

అమరావతి: రేపటి (అక్టోబర్ 1) నుంచి కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) వారాహి యాత్ర (Varahi Yatra) మొదలుకానుంది. ఈ సందర్భంగా వారాహి యాత్రకు పెడనలో చిల్లపల్లి శ్రీనివాస్, అమ్మిశెట్టి వాసు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ సమన్వయ కర్తలుగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వారాహి యాత్ర షెడ్యూల్‌ను తెలియజేశారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ అక్టోబర్ ఒకటి నుంచి నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభిస్తారని తెలిపారు. తొలిరోజు అవనిగడ్డలో బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. 2, 3 తేదీల్లో మచిలీపట్నంలో ప్రజలు, నాయకులతో సమావేశం అవుతారన్నారు. జనవాణి ద్వారా సమస్యలు అడిగి తెలుసుకుంటారన్నారు. నాలుగో తేదీన పెడనలో వారాహి యాత్ర ఉంటుందని చెప్పారు. జనసేనాధిపతికి దారి పొడవునా స్వాగతం పలికేందుకు జనం ఎదురు చూస్తున్నారన్నారు. చేనేత కార్మికులను కలిసి వారి‌ ఇబ్బందులు తెలుసుకుంటారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలు అమలు‌ చేయకుండా మోసం చేసిందని మండిపడ్డారు. ఈ వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ చేతి వృత్తులపై ఆధారపడిన వారికి ఒక భరోసా ఇస్తారన్నారు. యాత్రకు, సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఐదో తేదీన కైకలూరులో వారాహి యాత్ర కొనసాగుతుందని చిల్లపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-09-30T10:36:50+05:30 IST