Adi Narayana Reddy: రిమాండ్ రిపోర్టులోనే తప్పులు

ABN , First Publish Date - 2023-09-14T14:38:58+05:30 IST

కడప: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమం, దారుణమని, ఈ అరెస్ట్ చట్టబద్దంగా జరగలేదని మాజీమంత్రి, బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి అన్నారు.

Adi Narayana Reddy: రిమాండ్ రిపోర్టులోనే తప్పులు

కడప: టీడీపీ అధినేత (TDP Chief), మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్ (Arrest) అక్రమం, దారుణమని, ఈ అరెస్ట్ చట్టబద్దంగా జరగలేదని మాజీమంత్రి, బీజేపీ నేత (BJP Leader) ఆది నారాయణ రెడ్డి (Adi Narayana Reddy) అన్నారు. గురువారం ఆయన కడపలో మీడియాతో మాట్లాడుతూ.. రిమాండ్ రిపోర్టు (Remand Report)లోనే తప్పులు (Mistakes) ఉన్నాయని, నంద్యాలలో అరెస్టు చేసి.. మరో చోట అరెస్టు చేసినట్టు చూపించారన్నారు. అరెస్టు చేసిన రాత్రి నుంచి పోలీసులు హంగామా చేసి మరుసటిరోజు ఉదయం 6 గంటలకు అరెస్టు చేసినట్లు చూపించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు బీజేపీకు సంబంధం లేదని ఆది నారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

‘‘జగన్ నువ్వు తోడేలు లాంటి వాడివి నీతో మేము ఎలా కలిసి పని చేస్తాం? జగన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రం కాలి బూడిద అయిపోతోంది.. కోడి కత్తి కేసు ఓ డ్రామా కాదా?.. దేశంలో జీ-20 సదస్సు జరుగుతుంటే రాష్ట్రంలో ఈ అరెస్టులు ఏంటి? జీ-20 సదస్సుకు అన్యాయం చేయడం కోసమే ఈ అరెస్టులు.. నీ వ్యాపారం నీ దోపిడీ కోసం ఈ అక్రమ అరెస్టులు చేస్తున్నావ్.. వివేక హత్య కేసులో నీకు కావలసిన నీ బంధువులకు మాత్రం రక్షణ కల్పిస్తున్నావు.. నీ చొరవతో రాష్ట్రంలో లక్షల కోట్ల దోపిడీలు జరుగుతున్నాయి.. కడప జిల్లా పేరు కూడా మార్చి నీ తండ్రి పేరు పెట్టుకున్నావ్.. చంద్రబాబును అరెస్టు చేయమని బీజేపీ చెప్పిందా?.. సీఎం జగన్ దౌర్జన్యాన్ని బీజేపీ ఖండిస్తోంది.. నీకు చెక్కు పెట్టేది ఒక్క బీజేపీ మాత్రమే.. నీకు రోజుల దగ్గర పడ్డాయి’’ అంటూ ఆది నారాయణ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-09-14T14:38:58+05:30 IST