AP News: స్నేహితుడి మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టి.. ఆపై
ABN , First Publish Date - 2023-07-31T15:16:51+05:30 IST
స్నేహితుడి మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది.
కడప: స్నేహితుడి మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. ఈశ్వర్ రెడ్డి నగర్లో కిషోర్ అనే వ్యక్తి తన స్నేహితుడు సతీష్‌ను ఇంట్లోనే ఇసుకలో పూడ్చిపెట్టాడు. మృతుడు సతీష్ సుమారు నెల రోజుల క్రితం ఇంట్లో గొడవ పడి స్నేహితుడు కిషోర్ ఇంటికి వెళ్ళాడు. అయితే నెల రోజుల క్రితం హైదరాబద్ వెళ్లి ఇంటికి వచ్చిన కిషోర్ తల్లి.. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో కిషోన్ను ప్రశ్నించింది. దీంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. సతీష్‌ను చంపి ఇంట్లో పూడ్చిపెట్టినట్లు తన తల్లికి కిషోర్ చెప్పాడు. దీంతో భయాందోళనకు గురైన తల్లి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు సతీష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సతీష్‌ను కిషోర్ హత్య చేసి ఇంట్లో పూడ్చి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు కిషోర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.