CPM Baburao: పెట్టుబడుల సదస్సుతో ఏపీకి ఏమైనా లాభముందా?
ABN , First Publish Date - 2023-03-04T14:35:18+05:30 IST
విశాఖలో (Visakhapatnam) పెట్టుబడుల సదస్సుతో రాష్ట్రానికి (AP) పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందా? అని సీపీఎం బాబూరావు (CPM Baburao) ప్రశ్నించారు. విద్యుత్ భారాలు తగ్గించాలంటూ సీపీఎం (CPM) ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా
విజయవాడ: విశాఖలో (Visakhapatnam) పెట్టుబడుల సదస్సుతో రాష్ట్రానికి (AP) పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందా? అని సీపీఎం బాబూరావు (CPM Baburao) ప్రశ్నించారు. విద్యుత్ భారాలు తగ్గించాలంటూ సీపీఎం (CPM) ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడారు. ‘‘విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 3,083 కోట్ల భారం మళ్లీ మోపారు. ఏప్రిల్ నుంచి యూనిట్‌కు 66 పైసలు అదనంగా వసూలు చేస్తారు. గతంలో 2900 కోట్లు ట్రూ అప్ ఛార్జీల భారం వేశారు. వివిధ రూపాల్లో వేల కోట్లను ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో 200 యూనిట్ల వరకు ఉచితం అని జగన్ (JAGAN) హామీ ఇచ్చారు. ఇప్పుడు రెట్టింపు స్థాయిలో వసూళ్లు చేయడం దుర్మార్గం. అదానీతో (Adani) విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలి. ప్రజల సొమ్మును కార్పోరేట్ శక్తులకు దోచి పెడుతున్నారు. రీఛార్జి తరహాలో ప్రీపెయిడ్ తరహాలో ముందే కార్డు కొనుక్కుని విద్యుత్ వాడుకోవాలి. అదానీ తయారు చేసే ఈ మీటర్లను ప్రజలు కొనుగోలు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోపిడీ చేస్తున్నాయి. ఏదొక పేరు పెట్టి ప్రజలపై భారాలు మోపడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.’’ అని బాబూరావు ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: షాకింగ్ ఘటన.. పక్కింటి వాళ్లు పెళ్లికి పిలవలేదని ఓ వ్యక్తి వింత నిర్వాకం..!