Nara Lokesh: గ‌వ‌ర్న‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాలి

ABN , First Publish Date - 2023-09-19T09:00:23+05:30 IST

న్యూఢిల్లీ: అనారోగ్యానికి గురై మ‌ణిపాల్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నానని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.

 Nara Lokesh: గ‌వ‌ర్న‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాలి

న్యూఢిల్లీ: అనారోగ్యానికి గురై మ‌ణిపాల్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్ (Governor) జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ (Abdul Nazir) త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నానని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. క‌డుపునొప్పితో గ‌వ‌ర్న‌ర్ ఆస్ప‌త్రిలో చేరార‌ని తెలిసి తీవ్ర ఆందోళ‌న‌కి గుర‌య్యానన్నారు. అపెండిసైటిస్‌గా తేల్చిన వైద్యులు ఆప‌రేష‌న్ విజయవంతంగా చేశార‌ని, ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌నే స‌మాచారం తెలిసి ఊపిరి పీల్చుకున్నానని, గ‌వ‌ర్న‌ర్ సంపూర్ణ ఆరోగ్యంతో మ‌న ముందుకు వ‌స్తార‌ని ఆకాంక్షిస్తున్నానని లోకేష్ వ్యాఖ్యానించారు.

కాగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై మణిపాల్ ఆస్పత్రి వైద్యులు(Manipal Hospital Doctors) హెల్త్ బులిటెన్ (Health Bulletin) విడుదల చేశారు. మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ డా.సుధాకర్ కంటిపూడి గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై మీడియాకు వివరాలు తెలిపారు. గవర్నర్ తీవ్ర కడుపు నొప్పి కారణంగా మణిపాల్ హాస్పిటల్లో చేరారని, వైద్యపరీక్షల్లో అక్యూట్ అపెండిసైటిస్‌తో బాధ పడుతున్నట్లు తేలిందన్నారు. గవర్నర్‌కు రోబో సాయంతో 'అపెండెక్టమీ' అనే సర్జరీని డాక్టర్లు చేశారని, సర్జరీ విజయవంతమైందని తెలిపారు. ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డా. సుధాకర్ తెలిపారు.

Updated Date - 2023-09-19T09:00:23+05:30 IST