Bonda Uma: రాపాక వరప్రసాదరావు ఒక చిల్లర మనిషి..
ABN , First Publish Date - 2023-03-26T15:27:48+05:30 IST
విజయవాడ: ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు (Rapaka Varaprasada Rao) ఒక చిల్లర మనిషి అని.. వైసీపీ (YCP)కి అమ్ముడు పోయిన వ్యక్తి అని బోండా ఉమ విమర్శించారు.
విజయవాడ: ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు (Rapaka Varaprasada Rao) ఒక చిల్లర మనిషి అని.. వైసీపీకి (YCP) అమ్ముడు పోయిన వ్యక్తని టీడీపీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమ మహేశ్వరరావు (Bonda Umamaheswararao) అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జనసేన (Janasena) పార్టీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచి.. వైసీపీకి అమ్ముడుపోయిన రాపాకను ఎవరు నమ్మరని అన్నారు. రాపాక వరప్రసాద్‌ను కొనవలసిన అవసరం టీడీపీకి లేదన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్ధి గెలవాల్సిన 23 ఓట్లు తమకు స్పష్టంగా ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీగా గెలవడానికి 22 ఓట్లు చాలని అన్నారు. తాడేపల్లి స్క్రిప్ట్‌ని రాపాక వరప్రసాద్ చెపుతున్నారని విమర్శించారు. ‘రూ. 10 కోట్లు కాదు కదా.. 10 వేలు కూడా నీకు ఎక్కువే’ అని రాపాక వరప్రసాదరావును విమర్శించారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయమంటూ టీడీపీ తనకు రూ. 10 కోట్లు ఆఫర్ చేసిందని, దానికి తాను తిరస్కరించానని రాపాక వరప్రసాదరావు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు టీడీపీ నేత బోండా ఉమ కౌంటర్ ఇచ్చారు.