Kottu Satyanarayana: భక్తులకు అసౌకర్యం కలిగించిన అధికారి ఎవరైనా సస్పెండ్ చేస్తాం
ABN , First Publish Date - 2023-10-16T13:15:25+05:30 IST
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి మొదటిరోజు పెద్ద ఎత్తున భక్తులు రావడం ఇదే తొలిసారి అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి మొదటిరోజు పెద్ద ఎత్తున భక్తులు రావడం ఇదే తొలిసారి అని మంత్రి కొట్టు సత్యనారాయణ (Minister Kottu Satyanarayana) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీపీ, కలెక్టర్, ఈవో, ఇతర అధికారులతో సమావేశంలో సమస్యలకు పరిష్కారాలు నిర్ణయించామని తెలిపారు. ప్రోటోకాల్, డ్యూటీ పాస్‌లతో 500 లైన్లో కలపడం సరికాదని హెచ్చరించామన్నారు. భక్తులకు అసౌకర్యం కలిగించిన అధికారి ఎవరైనా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అసౌకర్యం కలగకుండా చూస్తున్నామన్నారుు. సామాన్య భక్తుడికి పెద్దపీట వేయాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. అన్న ప్రసాదం అందరికీ అందుతోందన్నారు. ఖాళీ కార్డులతో కూడా దర్శనానికి వస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.