Share News

AP Minister: అన్నపూర్ణాదేవిని దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి

ABN , First Publish Date - 2023-10-17T09:46:39+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దసర శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

AP Minister: అన్నపూర్ణాదేవిని దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసర శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణాదేవిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandrareddy) మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డికి ఆలయ మర్యాదలతో మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, దుర్గగుడి ఈవో కె.ఎస్.రామారావు, ఛైర్మన్ కర్నాటి రాంబాబు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తమ నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేకూర్చాలని అమ్మను వేడుకున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ మంచి విజయం సాధించాలని ప్రార్ధించానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.

Updated Date - 2023-10-17T09:46:39+05:30 IST