Cyclone Michaung: నెల్లూరుకు 80 కి.మీ దూరంలో తుఫాన్
ABN , First Publish Date - 2023-12-05T10:18:00+05:30 IST
Andhrapradesh: రాష్ట్రంపై మిచౌంగ్ తుఫాను ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. ప్రస్తుతం పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుఫాను మిచౌంగ్ కొనసాగుతోంది.
అమరావతి: రాష్ట్రంపై మిచౌంగ్ తుఫాను ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. ప్రస్తుతం పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుఫాను మిచౌంగ్ కొనసాగుతోంది. ప్రస్తుతానికి నెల్లూరుకు 80 కిలోమీటర్ల, బాపట్లకు 80 కిలోమీటర్ల, మచిలీపట్నానికి 140 కిలోమీటర్ల. దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. మధ్యాహ్ననంలోపు బాపట్ల దగ్గరలో తీవ్రతుఫానుగా మిచౌంగ్ తీరం దాటనుంది. తీరం వెంబడి గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాను బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు.