Share News

TDP MP: కరువు జిల్లాగా ప్రకటించాకే అడుగుపెట్టు జగన్!

ABN , First Publish Date - 2023-11-14T18:44:39+05:30 IST

జగన్ సర్కారుపై ఏపీ టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శలు గుప్పించారు.

TDP MP: కరువు జిల్లాగా ప్రకటించాకే అడుగుపెట్టు జగన్!

శ్రీకాకుళం: జగన్ సర్కారుపై ఏపీ టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శలు గుప్పించారు.

"రైతుల పట్ల వివక్ష చూపిస్తుంది జగన్ ప్రభుత్వం. రైతులు పంటలు ఎండి కన్నీరు కారుస్తున్నారు. ఒక్కరు కూడా ప్రభుత్వం నుంచి స్పందించడం లేదు. వర్షపాతం తక్కువ ఉంటుందని ముందు నుంచి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ వచ్చింది. అయినా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదు. పంట నష్ట పోకుండా రైన్ గన్స్, స్ర్పింకర్లు టీడీపీ హయాంలో చేశాం. కరువు మండలాలు సైతం ప్రకటించ లేదు. రైతును దగా చేస్తున్నారు తప్ప.. ఆదుకోవడంలేదు. పంట ఎండి నాశనమై పోతున్న పట్టించుకోవడం లేదు. ముప్పై శాతం వర్షపాతం తక్కువ ఉన్నా రాష్ట్రంలో 103 మండలాలు ప్రకటించారు. ఇరిగేషన్, అగ్రికల్చరల్ మినిష్టర్లు ఏం చేస్తున్నారు. ఇరిగేషన్ మంత్రి.. రైతులపాలిట ఇరిటేషన్ మంత్రిగా మారారు.

ఒక్క ప్రాజెక్టు, ఒక్క కాలువ కూడా పూర్తి చేయలేదు. కేనాల్స్‌లో పిడికెడు మట్టి కూడా పూడిక తీయలేదు. టీడీపీ, చంద్రబాబును తిట్టడం తప్ప.. మంత్రులు ప్రజలకోసం ఆలోచించడం లేదు. జగన్ వైఖరి తితిలీ విధ్వంసంలో చూశాం. అలాంటి వ్యక్తి ఇప్పుడు రైతులు నష్టపోతే బైటకు వస్తారా. బస్సులు యాత్ర ఏందుకు.. యాత్రాల్లో కనీసం రైతులు గురించి మాట్లాడటం లేదు. ప్రచార ఆర్బాటాల మీద శ్రద్ధ.. రైతుల మీద పట్టడం లేదు. జెండపట్టుకుని వేళ్తె.. చెప్పుతో కోట్టే పరిస్థితి ఉండటంతో అధికారులను ముందు పెట్టుకుని వెళ్తున్నారు. శ్రీకాకుళం జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలి. 23న వస్తున్న సీఎం.. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాకే అడుగుపెట్టాలి. ఇద్దరు మంత్రులు జిల్లాలో ఉన్నా కనీసం పట్టించుకోవడంలేదు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సడీ అందించాలి. చంద్రబాబుపై కేసులు ఏవిధంగా పెట్టించాలో ఆలోచిస్తున్నారు. తప్ప ప్రజలకు న్యాయం చేయడం లేదు. నేటికి స్కిల్ కేసులో సీఐడీ ఆధారాలు చూపించలేకపోతున్నారు." అని రామ్మోహన్ నాయుడు విమర్శించారు.

Updated Date - 2023-11-14T19:01:10+05:30 IST