Kurnool: జైల్లో తల్లి, బయట కుమార్తె.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో
ABN , Publish Date - Dec 16 , 2023 | 03:14 PM
తల్లి బిడ్డల మధ్య ఉన్న బంధం ఎలాంటిదో వేరే చెప్పనక్కర్లేదు. బిడ్డకు నలతగా ఉన్నా.. చిన్న అనారోగ్య సమస్య వచ్చినా.. కష్టం వచ్చినా.. అమ్మ మనసు తల్లడిల్లిపోతుంది. తల్లికి ఏం జరిగినా బిడ్డలు సైతం తట్టుకోలేరు.

కర్నూల్: తల్లి బిడ్డల మధ్య ఉన్న బంధం ఎలాంటిదో వేరే చెప్పనక్కర్లేదు. బిడ్డకు నలతగా ఉన్నా.. చిన్న అనారోగ్య సమస్య వచ్చినా.. కష్టం వచ్చినా.. అమ్మ మనసు తల్లడిల్లిపోతుంది. తల్లికి ఏం జరిగినా బిడ్డలు సైతం తట్టుకోలేరు. సరిగ్గా ఇలాంటి పరిస్థితికి అద్దంపట్టే హృదయవిదారక ఘటన ఓ చోట జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాలు.. కర్నూలుకు చెందిన ఓ మహిళను దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను రూరల్ సబ్ జైలుకు తరలించారు. విషయం తెలుసుకున్న ఆమె కుమార్తె జైలుకు పరిగెత్తుకుంటూ వచ్చింది. జైలు బయట గేటు ముందు నిల్చొని "అమ్మ బయటకి రా అమ్మా" అంటూ గుండెలవిసేలా ఏడ్చింది. అప్పటికే చాలా సేపటి వరకు అక్కడే ఏడుస్తూ ఉండిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను బంధువుల ఇంటికి పంపిచారు. చిన్నారి ఏడుస్తున్న వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. సదరు వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
చిన్నారి ఏడుస్తున్న వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
