Online Game: కుటుంబసభ్యుల ప్రాణాల మీదకు తెచ్చిన ఆన్లైన్ గేమ్
ABN , First Publish Date - 2023-08-25T14:34:16+05:30 IST
నగరంలోని పెందుర్తిలో దారుణం చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమింగ్ ఓ కుటుంబ సభ్యుల ప్రాణాల మీదకు తీసుకొచ్చింది.
విశాఖపట్నం: నగరంలోని పెందుర్తిలో దారుణం చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమింగ్ ఓ కుటుంబ సభ్యుల ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. గొరపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. సంతోష్ కుమార్ అనే వ్యక్తి ఆన్లైన్ గేమ్స్ కారణంగా అప్పుల పాలయ్యాడు. దీంతో అప్పులు తీర్చలేక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సంతోష్ కుమార్ తల్లి, తండ్రి, సోదరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గత రాత్రి 11 గంటలకు సంతోష్ ఇంటికి చేరి చూసే సరికి తల్లిదండ్రులు, సోదరి అపస్మారక స్థితిలో ఉన్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ముగ్గురిని కేజీహెచ్‌కు తరలించారు. కాగా కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తండ్రి కల్లూరి సత్యనారాయణ(51) మృతి చెందాడు. భార్య సూర్యకుమారి(45), కూతురు నీలిమ (21) పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యకు ఆన్లైన్ గేమ్ కారణమని కుటుంబసభ్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.