Pawankalyan: నేటి నుంచి ఆగస్టు 17 వరకు వారాహి విజయయాత్ర షెడ్యూల్ ఇదే...
ABN , First Publish Date - 2023-08-11T14:32:30+05:30 IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ వారాహి విజయయాత్ర షెడ్యూల్ ఖరారైంది.
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawankalyan) విశాఖలో వారాహి విజయయాత్ర (Varahi yatra) ఇప్పటికే కొనసాగుతుండా.. ఈ నెల 17 వరకు కొనసాగనున్న యాత్ర షెడ్యూల్‌ను పార్టీ ప్రకటించింది. ఈమేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla manohar) ప్రకటనను విడుదల చేశారు. శుక్రవారం విశాఖపట్నం ముఖ్యనేతలతో నాదెండ్ల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగదాంబ కూడలిలో జరిగిన బహిరంగ సభ విజయవంతంపై ప్రతీఒక్కరినీ అభినందించారు. విశాఖ పరిధిలో పవన్ కళ్యాణ్ చేపట్టే కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని స్పష్టం చేశారు. ఆపై పవన్ పర్యటన షెడ్యూల్‌పై నేతలతో నాదెండ్ల చర్చించి ఖరారు చేశారు.
వారాహి విజయ యాత్ర షెడ్యూల్ వివరాలు...
• 11న మధ్యాహ్నం భీమిలి నియోజకవర్గంలోని రుషికొండను సందర్శిస్తారు.
• 12న ఉదయం 11 గంటలకు పెందుర్తి నియోజకవర్గానికి వెళ్తారు. వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్దురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శ. అదే రోజు సాయంత్రం 4 గంటలకు విశాఖ నగరంలో సీఎన్‌బీసీ ల్యాండ్స్ ప్రాంతం సందర్శన
• 13న గాజువాక నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పవన్ పాల్గొననున్నారు.
• 14న ఉదయం 11 గంటలకు అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోని విస్సన్నపేటకు ఆక్రమణకు గురైన భూముల సందర్శన
• 15న మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరుకానున్న జనసేనాధిపతి
• 16న విశాఖ నగరం భీమిలి నియోజకవర్గంలో ధ్వంసానికి గురవుతున్న ఎర్రమట్టి దిబ్బల సందర్శన
• 17న విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమం