Share News

Gudivada Amarnath: నా అత్తారింటికి దారి చిట్టివలస.. మరి నీదేంటో చెప్పు పవన్?

ABN , First Publish Date - 2023-12-08T11:14:43+05:30 IST

Andhrapradesh: విశాఖలో సభ ప్రభుత్వం మీద విమర్శలకే పెట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో జనసేనకు వచ్చిన ఫలితాలు ఆంధ్రాలో కూడా రాబోతున్నాయన్నారు.

Gudivada Amarnath: నా అత్తారింటికి దారి చిట్టివలస.. మరి నీదేంటో చెప్పు పవన్?

విశాఖపట్నం: విశాఖలో సభ ప్రభుత్వం మీద విమర్శలకే పెట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై (Janasena Chief Pawan Kalyan) మంత్రి గుడివాడ అమర్నాథ్ (Minister Gudivada Amarnath) విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో జనసేనకు వచ్చిన ఫలితాలు ఆంధ్రాలో కూడా రాబోతున్నాయన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తే సరిపోతుందని.. జగన్నే టార్గెట్ చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యలను, వైఎస్సార్పీ తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి అన్నారు.


‘‘మీ స్థిర నివాసం హైదరాబాద్.. తెలంగాణలో మీ బలం చూసాం.. డిపాజిట్లు కూడా రాలేదు. ఆంధ్రాకు మీకు అసలేం సంబంధం ఏంటి? మీరు గత తొమ్మిది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని రోజులు ఉన్నారు పవన్ కళ్యాణ్ చెప్పాలి. పవన్ కళ్యాణ్ మీది ఏ నియోజకవర్గం చెప్పండి. గాజువాక భీమవరం మీ సొంత నియోజకవర్గo చెప్పండి. రాష్ట్రంలో ఏ నియోజకవర్గం మనకు తెలియదు. మీరు నాన్ రెసిడెంట్ ఆంధ్రా. నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఆదరించే, నియోజకవర్గ ఏది. పవన్ కళ్యాణ్‌కు అబ్రహం లింకన్స్ స్ఫూర్తి కాదు.. నారా లింకన్ స్పూర్తి. తెలంగాణలో బీజేపీని నాశనం చేసావ్.. ఇక్కడ ఏం చేస్తావో చూస్తాo. పొలిటికల్ కాంట్రాక్ట్ కోసం పుట్టిన పార్టీ జనసేన. తెలంగాణలో కాంట్రాక్ట్ తీసుకుని రేపు ఆంధ్రలో కాంట్రాక్ట్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపివేశామని కేంద్రం ఎక్కడైనా చెప్పిందా? నువ్వు ఎప్పుడైనా చెప్పావా. బీజేపీ నేతల పక్కన కూర్చుంటావు వారితో ఎప్పుడైనా చెప్పించావా. రాజధాని వచ్చినా బిల్డింగ్ నిర్మాణం చేస్తే ఎందుకు అడ్డుకుంటున్నావ్. సిద్ధాంతంలో బండ్ల గణేష్‌నైనా చూసి బుద్ధి తెచ్చుకోవాలి . ఒకే దెబ్బకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ రెండు పిట్టలు పడిపోతాయి. నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ దగ్గరుండి చంద్రబాబు నాయుడిని పొగుతున్నారు. పవన్ కళ్యాణ్ పక్కన నాదెండ్ల మనోహర్ కట్టప్ప ఉన్నాడు జాగ్రత్త. విశాఖలో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ కాదు. సాటిలైట్ సెంటర్ నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా. అత్తారింటికి దారేది.. రాజధానికి దారేది అంటున్నాడు. అత్తారింటికి దారేది అంటే నేను చిట్టివలస అని చెప్తున్నాను.. ఆయన ఏం చెప్తాడో! చెప్పమనండి’’ అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-12-08T11:18:50+05:30 IST