అనకాపల్లి ఎంపీడీవో హఠాన్మరణం
ABN , First Publish Date - 2023-01-12T01:48:34+05:30 IST
అనకాపల్లి ఎంపీడీవో డి.చంద్రశేఖర్(53) గుండెపోటుతో బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు. విశాఖ నగరంలోని సింహాచలంలో నివాసం వుంటున్న ఆయన మంగళవారం సాయంత్రం అనకాపల్లిలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి 11 గంటల సమయంలో తీవ్రఅస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి కుదుటపడకపోవడంతో కేజీహెచ్‌కు తరలించారు. ఆరోగ్యం విషమించడంతో బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు.

గుండెపోటుతో మృతిచెందిన చంద్రశేఖర్
తుమ్మపాల, జనవరి 11: అనకాపల్లి ఎంపీడీవో డి.చంద్రశేఖర్(53) గుండెపోటుతో బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు. విశాఖ నగరంలోని సింహాచలంలో నివాసం వుంటున్న ఆయన మంగళవారం సాయంత్రం అనకాపల్లిలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి 11 గంటల సమయంలో తీవ్రఅస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి కుదుటపడకపోవడంతో కేజీహెచ్‌కు తరలించారు. ఆరోగ్యం విషమించడంతో బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు.
చంద్రశేఖర్ దేవరాపల్లిలో ఈవోపీఆర్డీగా, జి.కె.వీధి, ఎస్.రాయవరం మండలాల్లో ఎంపీడీవోగా విధులు నిర్వహించారు. గత ఏడాది జూలై 22న ఎస్.రాయవరం నుంచి అనకాపల్లికి బదిలీ అయ్యారు. చంద్రశేఖర్ గుండెపోటుతో మృతిచెందినట్టు తెలియడంతో మండల పరిషత్ ఉద్యోగుల్లో విషాదం నెలకొంది. మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, రూరల్ ఎస్‌ఐ నరసింహారావు, రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు, సిబ్బంది సింహాచలంలోని చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు.