ఉపమాక సర్పంచ్‌గా వీరబాబు బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2023-08-15T00:31:23+05:30 IST

మండలంలోని ఉపమాక సర్పంచ్‌గా ప్రస్తుత ఉప సర్పంచ్‌ ప్రగడ వీరబాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

ఉపమాక సర్పంచ్‌గా వీరబాబు బాధ్యతల స్వీకరణ
ఉపమాక సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన వీరబాబు

నక్కపల్లి, ఆగస్టు 14 : మండలంలోని ఉపమాక సర్పంచ్‌గా ప్రస్తుత ఉప సర్పంచ్‌ ప్రగడ వీరబాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. డీపీఓ ఆదేశాల మేరకు కార్యదర్శి జైప్రకాష్‌ నియామక ఉత్తర్వులను వీరబాబుకు అందజేశారు. వీరబాబును పలువురు నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కురందాసు నూకరాజు, కొప్పిశెట్టి కొండబాబు, కొప్పిశెట్టి వెంకటేష్‌, కొప్పిశెట్టి బుజ్జి చెరుకూరి వెంకటేశ్వరరావు, సిద్దాబత్తుల నూకతాత, కొపిశెట్టి జగదీశ్వరరావు, కొంకిపూడి దొరబాబు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-15T00:31:23+05:30 IST