Share News

YV Subbareddy: దొడ్డి దారిన వైజాగ్ రావాలిసిన అవసరం లేదు

ABN , First Publish Date - 2023-10-13T15:26:54+05:30 IST

విశాఖపట్నం: దొడ్డి దారిన విశాఖపట్నం రావాలిసిన అవసరం తమకు లేదని.. రైట్ రాయల్‌గా హైవే మీదే వస్తామని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం విశాఖ వైసీపీ ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య నేతల సమావేశం జరిగింది.

YV Subbareddy: దొడ్డి దారిన వైజాగ్ రావాలిసిన అవసరం లేదు

విశాఖపట్నం: దొడ్డి దారిన విశాఖపట్నం రావాలిసిన అవసరం తమకు లేదని.. రైట్ రాయల్‌గా హైవే మీదే వస్తామని వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) వ్యాఖ్యానించారు. శుక్రవారం విశాఖ వైసీపీ (YCP) ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. నిర్మాణాలు పూర్తయ్యాక సీఎం జగన్ (CM Jagan) వైజాగ్ (Vizag) వస్తారని.. అక్టోబర్ లేదా నవంబర్ కావొచ్చునని అన్నారు. రాజధాని వసతుల కమిటీ ఒకసారి పర్యటించిన తర్వాత బిల్డింగ్‌లు ఫైనలైజ్ అవుతాయన్నారు. పచ్చ కామెర్లతో ఉన్న టీడీపీ (TDP) నేతలకు విశాఖ అభివృద్ది, ఆకాంక్ష పట్టదని, విశాఖ ప్రజలు కోరుకోవడం లేదంటున్న గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) ఎక్కడ నుంచి వచ్చారని ప్రశ్నించారు. వియ్యంకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం గంటా అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారని అన్నారు. జనసేన అధ్యక్షుడు (Janasena Chief) పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)పై ముఖ్యమంత్రి వ్యాఖ్యల్లో అనుచితం ఏమీ లేదని సమర్ధించుకున్నారు. ఉన్న మాటే సీఎం జగన్ చెప్పారన్నారు. 175 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు లేని పవన్ కోసం మాట్లాడటం వృధా అని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-10-13T15:26:54+05:30 IST