AP News: ‘జగన్ వ్యాఖ్యలను జనం మరిచిపోలేదు’

ABN , First Publish Date - 2023-04-11T19:29:19+05:30 IST

చైతన్య రధం పత్రిక కేంద్ర కార్యాలయానికి సీఐడీ (CID) అధికారులు నోటీసులు ఇవ్వడం దారుణమని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) అన్నారు.

AP News: ‘జగన్ వ్యాఖ్యలను జనం మరిచిపోలేదు’

ఏలూరు: చైతన్య రధం పత్రిక కేంద్ర కార్యాలయానికి సీఐడీ (CID) అధికారులు నోటీసులు ఇవ్వడం దారుణమని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) అన్నారు. చైతన్య రధం పత్రికలో ఎక్కడ అసత్య ప్రచారం చెయ్యడం లేదన్నారు. సీఐడి అధికారులు సాక్షి పేపర్, జగన్ యూట్యూబ్ చానళ్ళకు నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ (CM Jagan) పాదయాత్రలో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu)పై చేసిన వ్యాఖ్యలను జనం మరిచిపోలేదన్నారు. సీఎం జగన్ అరాచకాలను, దోపిడీలను యువగళం పాదయాత్రలో లోకేష్ (Lokesh) ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. యువగళం పాదయాత్రలో వైసీపీ (YCP) దోపిడీలను సాక్ష్యాలతో సహా ప్రజలు బయటపెడుతున్నారని విమర్శించారు. ఈ నెల 14 న నూజివీడులో చంద్రబాబు సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఐదు నియోజకవర్గాల నుంచి ప్రజలు చంద్రబాబు సభకు తరలి వెళ్ళనున్నారని తెలిపారు. సీఎం జగన్ను ఎప్ప్పుడు గద్దె దింపుదామాని ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-04-11T19:29:19+05:30 IST