షోకాజ్ నోటీసులివ్వండి
ABN , First Publish Date - 2023-02-09T00:20:10+05:30 IST
ఏలూరు నగరంలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ బుధవారం మునిసిపల్ కమిషనర్ ఎస్.వెం కటకృష్ణతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు.

సచివాలయాల్లోని అసిస్టెంట్ ఇంజనీర్ల పర్యవేక్షణేదీ ?
షోకాజ్ నోటీసులివ్వండి
ఏలూరు నగర కమిషనర్‌కు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశం
ఏలూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 8 : ఏలూరు నగరంలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ బుధవారం మునిసిపల్ కమిషనర్ ఎస్.వెం కటకృష్ణతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. రూ.146.81 లక్షలతో చేపట్టిన 44 పనుల్లో భాగంగా లబ్బిపేట, ఎంఆర్‌సీ కాలనీ, పంపులచెరువు సెంటర్, తోటకూరదొడ్లు, యాదవనగర్, పోస్టల్ కాలనీల్లో పూర్తి చేసిన సీసీ రోడ్లు, డ్రెయిన్లను, ఎంపీ నిధులు రూ.91.50 లక్షలతో ఐదు వివిధ అభివృద్ధి పనుల్లో పూర్తి అయిన మల్టీపర్పస్ భవనాలు, గాంధీ జ్ఞాన మందిర్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ రోడ్లు అక్కడక్కడా ఫినిషింగ్ సరిగా లేదని వాటిని సరిచేయాలన్నారు. రోడ్లపై ఉన్న వాటర్ పైపులు తొలగించి నీరు వృథా కాకుండా చూడా లన్నారు. డ్రెయిన్లలో చెత్త తొలగింపు సరిగ్గా చేయడం లేదని, సరి చేసి ఫొటోలు తీసి సమర్పించాలన్నారు. వార్డు, సచివా లయాల్లో వున్న అసిస్టెంట్ ఇంజనీర్ల పర్యవేక్షణ సరిగా లేదని వారికి షోకాజు నోటీసులు ఇవ్వాలని కమిషనర్‌ను ఆదేశిం చారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కార్పొరేషన్ ఎంఈ భాస్కర రావు, ఎంహెచ్‌వో ఆర్.మాలతీ, పబ్లిక్ హెల్త్ డీఈ ఫణి భూషణ్, తదితరులు పాల్గొన్నారు.