వేంకటేశ్వరస్వామికి ఊంజల్ సేవ
ABN , First Publish Date - 2023-01-07T23:53:55+05:30 IST
పుష్యమాసం పురస్కరించుకుని జువ్వలపాలెం రోడ్డులోని పద్మావతి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం స్వామి, అమ్మవార్లకు ఊంజల్ సేవ నిర్వహించారు.

భీమవరం టౌన్, జనవరి 7: పుష్యమాసం పురస్కరించుకుని జువ్వలపాలెం రోడ్డులోని పద్మావతి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం స్వామి, అమ్మవార్లకు ఊంజల్ సేవ నిర్వహించారు. ఆలయ అర్చకుడు వాడపల్లి ఆదినారాయణాచార్యులు ఆధ్వర్యంలో ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఊయలలో ఉంచి వేద మంత్రాలతో సేవను నిర్వహించారు. ఆలయ ఈవో ఆర్.గంగా శ్రీదేవి, చైర్మన్ మంతెన రామ్‌కుమార్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
గునుపూడిలోని బంట్రోతుల వారి వీధిలో శ్రీకృష్ణుడికి పూజలు చేసి చామంతు లతో అలంకరించారు. ఆలయ అర్చకుడు కొమ్ము శ్రీనివాస్ ఆధ్వర్యంలో 11 కేజీల చామంతులతో పూజలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
పాలకొల్లు అర్బన్: అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో శని వారం ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన అర్చకులు కె శ్రీనివాసాచార్యులు, పవన్ కుమార్, వెంకట కృష్ణ మాచార్యులు స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు, తిరుమంజన సేవలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు.
డైలీ మార్కెట్‌లో వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం అర్చకుడు గోవర్ధనం కృష్ణ చైతన్య ప్రత్యేక పూజలు నిర్వహించి, తులసి మాలలతో అలంకరించారు. పలువురు మహిళలు విష్ణు, లలితా సహస్ర పారాయణ నిర్వహించారు. కెనాల్ రోడ్డు, శంభన్న అగ్రహారంలో వేంకటేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు.