Share News

ప్యూర్‌ ఈవీ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌

ABN , First Publish Date - 2023-11-24T01:35:18+05:30 IST

ప్యూర్‌ ఈవీ మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌ను విడుదల చేసింది...

ప్యూర్‌ ఈవీ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌

ధర రూ. 1,29,999

హైదరాబా ద్‌ (ఆంధ్రజ్యో తి బిజినెస్‌): ప్యూర్‌ ఈవీ మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌ను విడుదల చేసింది. ఎకోడ్రైఫిట్‌ 350 మోటార్‌ సైకిల్‌ ఒక సారి ఛార్జి చేస్తే 171 కిలోమీటర్ల ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది. 110 సీసీ కమ్యూటర్‌ విభాగం బైక్‌లో ఇదే అత్యధిక దూరం ప్రయాణించే మోటార్‌ సైకిల్‌ అని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ వీ రోహిత్‌ తెలిపారు. 3.5 కేడబ్ల్యూహెచ్‌ లిథియం-అయాన్‌ బ్యాటరీ, 3 కేడబ్ల్యూ పవర్‌ట్రైన్‌ ఉండే ఈ బైక్‌ ధర రూ.1,29,999. ఈ బైక్‌ గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది.

Updated Date - 2023-11-24T01:36:26+05:30 IST