Auto Expo2023: కొత్త కార్ల కనువిందు.. ఆటో ఎక్స్‌పో 2023 తొలి రోజు ఆవిష్కరణలు ఇవే..
ABN , First Publish Date - 2023-01-11T18:56:28+05:30 IST
దేశంలో ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే అతిపెద్ద ఆటోమోటివ్ షో ‘ఆటో ఎక్స్‌పో 2023 ఇండియా’ (Auto Expo 2023 India) న్యూఢిల్లీ వేదికగా బుధవారం ప్రారంభమైంది.
న్యూఢిల్లీ: దేశంలో ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే అతిపెద్ద ఆటోమోటివ్ షో ‘ఆటో ఎక్స్‌పో 2023 ఇండియా’ (Auto Expo 2023 India) న్యూఢిల్లీ వేదికగా బుధవారం ప్రారంభమైంది. కొత్త ఆవిష్కరణలు, ప్రదర్శనలతో మొదటి రోజు పలు కార్లు, వాహనాలు సందడి చేశాయి. వీక్షకులను కట్టిపడేశాయి. మారుతీ సుజుకీ (Maruti suzuki), హ్యూందాయ్ (Hyundai Motor Compan), కియా(Kia), ఎంజీ(MG), టొయోటా(Toyato)తోపాటు టాటా మోటార్స్ (TATA Motors) వంటి దిగ్గజ కంపెనీలు ఈ షోలో పాల్గొన్నాయి. బీవైడీ, టార్క్ మోటార్స్, ఒకినావా ఆటోటెక్, హీరో ఎలక్ట్రిక్, లాగ్9, ఒమేగా సికీతోపాటు ఇతర మరిన్ని కంపెనీలు భాగస్వామ్యమవుతున్నాయి. పలు కంపెనీలు తమ కొత్త కార్లను ఆవిష్కరించగా.. మరికొన్ని కంపెనీలు పలు కార్లను ప్రదర్శించాయి. ఈ కార్లు సందర్శకులను కట్టిపడేశాయి. అయితే మహింద్రా, స్కోడా ఆటో ఓక్స్‌వేగన్ గ్రూప్, నిస్సాన్, రెనాల్ట్, బీఎండబ్ల్యూ, జాగ్వార్ లాండ్ రోవర్, మెర్సిడెస్- బెంజ్, హోండా వంటి కంపెనీలు ఈ ఏడాది షోలో పాల్గొనడం లేదు. ఆటో ఎక్స్‌పో2023లో తొలి రోజు ఆవిష్కరించిన కొన్ని కార్లపై ఓ లుక్కేద్దాం..
- మారుతీ సుజుకీ (Maruti Suzuki) తన తొలి ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ) కాన్సెప్ట్ ‘ఈవీఎక్స్ ఎస్‌యూవీ’ (eEV SUV)ను ప్రదర్శించింది. 60కిలోవాట్స్ బ్యాటరీతో వస్తున్న ఈ కారు ఒక్కసారి ఛార్జింగ్‌తో 550 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈవీఎక్స్‌తోపాటు గ్రాండ్ విటారా, బ్రెజ్జా కార్లను శాటిన్ బ్లాక్ ఎడిషన్లలో మారుతీ సుజుకీ ప్రదర్శించింది.
- ఎంజీ హెక్టార్ కంపెనీ 2023 హెక్టార్ కారును ఆవిష్కరించింది. ఈ కారు ప్రారంభ ధర రూ.14.73 లక్షల నుంచి రూ.22.4 లక్షలుగా(ఎక్స్ షోరూం) ఉంది.
- టొయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ ప్రీవియస్-జనరేషన్ ప్రియస్‌ను ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించింది.
- వోల్వో, ఐషర్ మోటార్స్ జాయింట్ వెంచర్ భారత్‌లోనే పొడవైన 13.5 మీటర్ల ఎలక్ట్రిక్ బస్‌ను ఆవిష్కరించింది.
- హ్యూందాయ్ ఐయోనిక్ 6 ఈవీ కారును కంపెనీ లాంచ్ చేసింది.
- బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఆటోఎక్స్ 2023 ఇండియా వేదికగా హ్యూందాయ్ ఐయోనిక్ 5ను (IONIQ 5) ఆవిష్కరించాడు.
- కియా మోటార్స్ ‘కియా ఈవీ9 కాన్సెప్ట్’ను (Kia EV Concept) ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. కియా కేఏ4 కొత్త జనరేషన్ కారును కూడా ప్రదర్శించింది.