Amazon : అమెజాన్‌లో ఉద్యోగాల కోత... మరో 9,000 మంది ఉద్యోగులు ఇంటికే...
ABN , First Publish Date - 2023-03-21T11:37:00+05:30 IST
టెక్నాలజీ రంగాన్ని నమ్ముకున్నవారికి మరింత ఆందోళనకరమైన వార్త ఇది. అమెజాన్ (Amazon.com Inc) మరో 9,000 మంది ఉద్యోగులకు
న్యూఢిల్లీ : టెక్నాలజీ రంగాన్ని నమ్ముకున్నవారికి మరింత ఆందోళనకరమైన వార్త ఇది. అమెజాన్ (Amazon.com Inc) మరో 9,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకబోతున్నట్లు ప్రకటించింది. ఆర్థిక అస్థిరతను తట్టుకోవడానికి, కార్యకలాపాలను కుదించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఉద్యోగ కల్పనలో తనకు గొప్ప చరిత్ర ఉందని చెప్పుకునే ఈ కంపెనీ తన 3 లక్షల మంది ఉద్యోగుల్లో ఇటీవలి నెలల్లో దాదాపు 27 వేల మందిని తొలగించింది.
ముఖ్యంగా క్లౌడ్, అడ్వర్టయిజింగ్ డివిజన్లలో పని చేస్తున్న ఉద్యోగులను తొలగించడంపై అమెజాన్ దృష్టి పెట్టింది. ఈ రెండు విభాగాలు ఆ సంస్థకు గొప్ప లాభదాయకమైనవనే సంగతి తెలిసిందే. ఈ రెండు విభాగాలను ఎవరూ ముట్టుకోరని చాలా కాలంపాటు చాలా మంది భావించారు. అయితే బిజినెస్ కస్టమర్లు తమ ఖర్చులను పరిశీలించుకోవడం ప్రారంభించడంతో అమెజాన్ ఈ విభాగాల్లో కొందరు ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. అమెజాన్‌లోని స్ట్రీమింగ్ యూనిట్ ట్విచ్ (Twitch)లో కూడా ఉద్యోగాల కోత జరగబోతోంది. నవంబరు నుంచి ఈ కంపెనీ డివైసెస్, ఈ-కామర్స్, మానవ వనరుల సంస్థల్లో పని చేసేవారిలో కొందరిని తొలగించారు. ప్రస్తుతం ఏప్రిల్ నాటికి ఎవరిని తొలగించాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకోబోతోంది.
ఇదిలావుండగా, అమెజాన్ స్టాక్స్ 2 శాతం పతనమయ్యాయి. ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్ కూడా ఈ సంవత్సరం దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించబోతోంది. 2022లో ఈ సంస్థ దాదాపు 11 వేల మందికి ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
2024 Lok Sabha Polls : బీజేపీని ఓడించడం అసాధ్యం, అయితే ... : ప్రశాంత్ కిశోర్
Khalistan : ఖలిస్థాన్ అనుకూల ట్విటర్ ఖాతాలపై కొరడా